zebra movie

Zebra | సత్యదేవ్‌ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి

యాక్టర్‌ సత్యదేవ్‌ (Satyadev) సినిమాల్లో తన ప్రత్యేకతతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడు. కథను నమ్ముకొని, హిట్ లేదా ఫ్లాప్ తో సంబంధం లేకుండా వేరియేషన్స్ ఉన్న సినిమాలు చేస్తూ ఆయన టాప్ ప్లేస్‌ లో ఉన్నారు. ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు వీటిలో ఒకటి “జీబ్రా” ఈ సినిమా డైరెక్టర్‌ ఈశ్వర్‌ కార్తీక్‌ (Eswar Karthik) దర్శకత్వంలో యాక్షన్‌ క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది మేకర్స్‌ ఈ సినిమాను అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ముందుగా ప్రకటించినా ఊహించని పరిస్థితుల వలన విడుదల వాయిదా పడింది సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా పడిందని, కొత్త విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు అయితే వాయిదాకు గల కారణాల గురించి ఇంకా అధికారిక సమాచారం లేదు.

సత్యదేవ్‌ కి జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తున్న ఈ సినిమాలో పుష్ప ఫేమ్‌ ధనంజయ (జాలిరెడ్డి) కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాను ఓల్డ్ టౌన్ పిక్చర్స్ మరియు పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఎస్‌ఎన్‌ రెడ్డి బాలసుందరం దినేష్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన జీబ్రా టీజర్‌ కు మంచి స్పందన లభించింది సత్యదేవ్‌ ప్రస్తుతం ఫుల్ బాటిల్ మరియు “గరుడ చాప్టర్ 1” అనే రెండు కీలక ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నారు ఫుల్ బాటిల్ షూటింగ్ దశలో ఉండగా గరుడ చాప్టర్ 1 ప్రొడక్షన్‌ దశలో ఉంది.

    Related Posts
    Salman Khan: భారీ భద్రత నడుమ బాబా సిద్ధిఖీ నివాసానికి వచ్చిన సల్మాన్ ఖాన్
    Salman Khan Baba Siddique 1728822044300 1728822058167

    NCP నేత బాబా సిద్ధిఖీ ముంబయిలో హత్యకు గురికావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన ఘటన. గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపగా, సిద్ధిఖీ అక్కడిక్కడే మరణించారు. బాలీవుడ్ సూపర్ Read more

    తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానన్న మోహన్ బాబు
    mohanbabu

    ప్రఖ్యాత సినీ నటుడు మోహన్ బాబు ఇటీవల తన 50వ సంవత్సర సినీ ప్రయాణం జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఒక Read more

    తండ్రీ కొడుకులిద్దరి పేర్లు తీస్తూ, నయనతార వివాదం…ఓపెన్ లెటర్
    nayanthara 2

    దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్‌గా మారిన వివాదం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్‌స్టార్ నయనతారల మధ్య జరుగుతోంది. ఈ Read more

    ప్రశాంత్ నీల్‌ సినిమాల పైనే ఫ్యాన్స్ ఎక్కువ అంచనాలు
    ప్రశాంత్ నీల్‌ సినిమాల పైనే ఫ్యాన్స్ ఎక్కువ అంచనాలు

    ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా టాలీవుడ్ స్టార్ జూ. ఎన్టీఆర్ ఈ మధ్యే ‘దేవర’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన Read more