ఆనంపై వేటు వేసిన వైస్సార్సీపీ పార్టీ

అంత భావించినట్లే ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైస్సార్సీపీ అధిష్టానం వేటు వేసింది. గత కొద్దీ రోజులుగా సొంత పార్టీ కి వ్యతిరేకంగా ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్స్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా రాపూరులో వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఆనం మాట్లాడుతూ..’రోడ్లులో గుంతలు కూడా పూడ్చలేకపోతున్నాం.. తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నాం.. కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద నిధులు ఇస్తారు. అప్పుడు నీళ్లు ఇస్తామని చెప్పుకోవాల్సి న పరిస్థితి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే.. మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని..వారి మాటలకు సిగ్గేస్తుందని ఆనం అన్నారు.

‘ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు వేయమని ఎలా అడగాలి. ప్రాజెక్టులు ఏమన్నా కట్టామా. ఏ పనైనా మొదలుపెట్టామా. శంకుస్థాపన ఏమన్నా చేశామా. ప్రజలను ఏమని ఓట్లు అడగాలి. కేవలం పింఛన్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా. గత ప్రభుత్వం కూడా పింఛన్లు ఇచ్చింది. వాళ్లకు ప్రజలు ఓట్లు వేశారా. ఇళ్లు కడతామని లేఔట్ వేశాం. ఇళ్లు ఎక్కడైనా కట్టామా’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ లో పెద్ద దుమారమే రేపాయి.

ఈ వ్యాఖ్యల తర్వాత పార్టీ అధిష్టానం ఆనం ఫై ఆగ్రహం తో ఉంది. ఈ క్రమంలో ఆయన ఫై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో వెంకటగిరి నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి పదవి నుంచి ఆనంను తొలగించారు. ఆయన స్థానంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి నూతన ఇన్చార్జిగా నియమించారు. ఈ మేరకు వైస్సార్సీపీ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యకలాపాలన్నీ ఇకపై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతాయన్నది తెలిపారు.