గుడ్లవల్లేరు ఘటన – ఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకు గురిచేసింది: షర్మిల

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని APCC చీఫ్ షర్మిల అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. ఫాస్ట్రాక్ విచారణ జరిపి మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ‘కాలేజీ టీడీపీ సానుభూతిపరులదే కావడంతో యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తమ భద్రతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసినా యాజమాన్యం స్పందించలేదు. హిడెన్ కెమెరా ఘటనల ఆరోపణల్లో ఏమీ లేదని పోలీసులు తేల్చేశారు. విద్యార్థులకు మీరు కల్పించే రక్షణ ఇదేనా?’ అని ప్రశ్నిస్తూ చంద్రబాబు, పవన్, లోకేశ్, అనితలను ట్యాగ్ చేసింది.

బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా విషయాన్ని వారం నుంచి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఓ విద్యార్థిని మండిపడింది. ‘నిన్న సా. 5 గంటలకు మరోసారి కంప్లెట్ ఇస్తే ఇన్వెస్టిగేషను నెల సమయం కావాలన్నారు. మళ్లీ రాత్రికి రాత్రి ఫేక్ న్యూస్ అని స్ప్రెడ్ చేశారు. ఆ అమ్మాయి నాన్నను పిలిపించండి. మా మీద రివర్స్ కేసులు ఎందుకు పెడతారు? మేమేం చేశాం. న్యాయం కోరడమే నేరమా?’ అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ఘటన ఫై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఉన్నంత అధికారులను నివేదికను సీఎం కోరారు.