ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ సంచ‌ల‌న‌ ట్వీట్..

దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై పెను దుమారం నడుస్తుంది. చాలామంది ఈ ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వారితో మాజీ సీఎం జగన్ కూడా గొంతు కలిపారు. ఈవీఎంల స్థానంలో పేపర్‌ బ్యాలెట్ వాడితేనే ప్రజాస్వామ్యం ఫరడవిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జగన్ ఎప్పుడూ నేరుగా ఈవీఎంలను టార్గెట్ చేయలేదు. అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు. కానీ తొలిసారి ఆయన ఈవీఎంల గురించి ట్వీట్ చేశారు.

“న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి” అని జగన్ ట్వీట్ చేశారు. కాగా, ఈవీఎంలను హ్యాక్ చేయచ్చంటూ టెక్నాలజీ దిగ్గజం ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

Just as justice should not only be served, but should also appear to have been served, so should democracy not only prevail but must appear to be prevalent undoubtedly.

In electoral practices across the world in almost every advanced democracy, paper ballots are used, not EVMs.…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 18, 2024