నేడు కర్నూలు జిల్లా నేతలతో కీలక భేటీ

YS Jagan: నేడు కర్నూలు జిల్లా నేతలతో జగన్ భేటీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాజకీయంగా కీలకమైన ఈ భేటీ ద్వారా జగన్ పార్టీ బలోపేతానికి ముందడుగు వేసేలా నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.

Advertisements

ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష

సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. అలాగే నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, మాజి ఎంపీలు, మాజి ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పార్టీ పునర్‌వ్యవస్థీకరణ, రాబోయే ఎన్నికల వ్యూహం, బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి వంటి అంశాలు చర్చకు వస్తాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే తీరుపై నేతలతో జగన్ చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం ఎలా కొనసాగించాలి, ప్రతి నియోజకవర్గంలో ప్రజా భరోసా యాత్రల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎత్తి చూపించాలి అనే విషయాల్లో పార్టీ నాయకులకు స్పష్టమైన మార్గదర్శకత్వం ఇవ్వనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, కూటమి ప్రభుత్వం అమలు చేయని ఎన్నికల హామీలపై ప్రజా పోరాటం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే వైసీపీ నేతలు తాడేపల్లికి చేరుకున్నారు. 

Read also: Krishnadevarayalu: అమిత్ షాకు లేఖ రాసిన టీడీపీ ఎంపీ

Related Posts
ఏపీలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు
New pass books in AP from April 1

ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను పంపిణీ అమరావతి : ఏపీ రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న Read more

Manchu Manoj: మోహ‌న్ బాబు ఇంటికి చేరుకొని రచ్చ చేసిన మనోజ్
Manchu Manoj: మోహ‌న్ బాబు ఇంటికి చేరుకొని రచ్చ చేసిన మనోజ్

మళ్లీ వార్తల్లో మంచు కుటుంబం: మ‌నోజ్‌-విష్ణు మధ్య వాడీవేడి వివాదం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుటుంబం మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. గత Read more

Love Affair: మితిమీరిన ప్రియుడిపై మోజు..చివరికి ఏం చేసిందో తెలుసా?
మితిమీరిన ప్రియుడిపై మోజు..చివరికి ఏం చేసిందో తెలుసా?

ప్రియుడు తనతో క్లోజ్‌గా ఉండటం లేదని.. ఓ మహిళ తిక్క పనికి పూనుకుంది. ఆమె చేసిన పనితో ఏకంగా రూ. 19 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. Read more

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం ప్రైవేటు వర్సిటీల చట్టసవరణ ఆమోదం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×