Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ పై : హర్షసాయిపై కేసు నమోదు తెలంగాణలో బెట్టింగ్ యాప్స్పై కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, వాటికి ప్రచారం చేసే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా, ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి పై కేసు నమోదైంది. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినందుకే సైబరాబాద్ పోలీసులు హర్షసాయిపై కేసు నమోదు చేశారని తెలిపారు.

బెట్టింగ్ యాప్స్ ప్రచారం – హర్షసాయి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల హర్షసాయి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
తాను ప్రమోట్ చేయకపోతే ఇతరులు చేస్తారని పేర్కొన్నారు
ఆ డబ్బును ఎందుకు వదులుకోవాలి అని ప్రశ్నించారు
బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బును పేదలకు పంచుతున్నానని వెల్లడించారు
ఈ వ్యాఖ్యలు చూసిన సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన “అలాంటి అబద్ధపు మాయ మాటలు చెప్పి, ప్రజలను మోసం చేయడం సహించరాని విషయం” అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై ప్రభుత్వం గట్టి చర్యలు
ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లువెన్సర్లపై కేసులు నమోదయ్యాయి
బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేసే వారికి కఠిన శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు
ప్రజలు ఇటువంటి యాప్స్ మాయలో పడకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది
సమాజానికి విపరీతమైన ముప్పుగా మారుతున్న బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకెంతమంది ఇరుక్కుంటారో వేచిచూడాలి.