మెగా DSC పోస్టులపై వైసీపీ vs టీడీపీ వార్

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు గురువారం సాయంత్రం పదవి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలుకు తొలి సంతకాలు చేసారు. మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేసి, నిరుద్యోగుల సమక్షంలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఇక ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌పై రద్దు చేస్తామని ఇచ్చిన హామీ రెండో హామీపై రైతుల సమక్షంలోనే సంతకం చేశారు. సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు దస్త్రంపైనా లబ్ధిదారులు సమక్షంలో మూడో సంతకం చేశారు. నైపుణ్య గణన దస్త్రంపై నాలుగో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై విద్యార్థుల సమక్షంలో ఐదో సంతకాన్ని చేశారు.

మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు మెగా మోసం చేసారని వైసీపీ విమర్శలు చేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. 25,000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్న చంద్రబాబు.. 16,347 పోస్టులే ఇచ్చారని వైసీపీ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ ఫై టిడిపి కౌంటర్ ఇచ్చింది. ‘ఐదేళ్లు మెగా డీఎస్సీ అని ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని నువ్వు ఎక్కడ? వచ్చిన మొదటి రోజే 16వేల టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన చంద్రబాబు ఎక్కడ?’ అని రిప్లె ఇచ్చింది.

ఈ ఫేక్ పనులు మానవా పులివెందుల ఎమ్మెల్యే ?

5 ఏళ్ళు మెగా డీఎస్సీ అని, ప్రతి ఏటా డీఎస్సీని, గిరిజన డీఎస్సీ అని చెప్పి, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని నువ్వు ఎక్కడ ? ఇచ్చిన హామీ ప్రకారం, వచ్చిన మొదటి రోజే, 16 వేల టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన చంద్రబాబు గారు ఎక్కడ?

గంజాయితో… https://t.co/PQPtqzQzmz— Telugu Desam Party (@JaiTDP) June 13, 2024