Delimitation:డీలిమిటేషన్ సమావేశానికి వైసీపీ దూరం!

Delimitation:డీలిమిటేషన్ సమావేశానికి వైసీపీ దూరం!

2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల పెరుగుదల ఉండదని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా లబ్ధిపొందుతాయనే భావన పెరుగుతోంది.ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సరికొత్త శ్రీకారం చుట్టారు.

Advertisements

డీలిమిటేషన్‌పై స్టాలిన్ ఆందోళన

డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశముండటంతో, దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం దక్కదని స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు. అందువల్ల దక్షిణాదిన ఉన్న అన్ని మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు చెన్నైలో ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీ ముఖ్య డిమాండ్ “ఫెయిర్ డీలిమిటేషన్”.

జగన్ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. డీలిమిటేషన్ వల్ల ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా నెలకొన్న ఆందోళనల గురించి ప్రస్తావించారు. ఇదే లేఖను స్టాలిన్‌కు పంపించారు. లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గకుండా చూసుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 1971, 2011 నాటి జనాభా లెక్కల వివరాలను ఇందులో పొందుపరిచారు. అండమాన్ నికోబార్ సహా దక్షిణాదిన ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంత శాతం మేర జనాభా పెరిగింది? తగ్గింది అనేది వివరించారు.

సమాన ప్రాతినిథ్యం

సౌత్‌లో ఎక్కడ ఎంత 2011 నాటి లెక్కల ప్రకారం ఏపీలో 1971లో 5.05 శాతం మేర జనాభా ఉండగా.. 2011 నాటికి ఈ సంఖ్య క్షీణించిందని పేర్కొన్నారు. 4.08 శాతానికి తగ్గినట్లు తెలిపారు. అండమాన్ నికోబార్- 0.02 నుంచి 0.03, తెలంగాణ- 2.89 నుంచి 2.91, కర్ణాటక- 5.34 నుంచి 5.05, కేరళ- 3.89 నుంచి 2.76, తమిళనాడు- 7.52 నుంచి 5.96, పుదుచ్చేరి- 0.09 నుంచి 0.10 శాతం ఉన్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 (2) (ఏ)ను ఈ సందర్భంగా మోదీకి గుర్తు చేశారు వైఎస్ జగన్. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు సమానంగా చిన్న రాష్ట్రాలకు కూడా పార్లమెంట్‌లో సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించాల్సి ఉంటుందని ఈ ఆర్టికల్ చెబుతోందని వివరించారు.

images (27)

కీలక నేతలు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బిజు జనతాదళ్ ప్రతినిధులు ఈ భేటీలో హాజరయ్యారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెన్నై చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా హాజరుకాలేనని స్పష్టం చేస్తూ స్టాలిన్‌కు లేఖ రాశారు.

రాజకీయ ప్రాధాన్యత

ఈ సమావేశానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.రేవంత్ రెడ్డి,కేటీఆర్ ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.బీజేపీ-ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతోందంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బిజు జనతాదళ్ ప్రతినిధులు ఈ భేటీలో హాజరయ్యారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెన్నై చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా హాజరుకాలేనని స్పష్టం చేస్తూ స్టాలిన్‌కు లేఖ రాశారు. 

Related Posts
UNSC టెర్రర్ బ్లాక్‌లిస్ట్ ప్రక్రియలో పారదర్శకత కోసం భారతదేశం పిలుపు
UNSC టెర్రర్ బ్లాక్‌లిస్ట్ ప్రక్రియలో పారదర్శకత కోసం భారతదేశం పిలుపు

భారతదేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) టెర్రర్ బ్లాక్‌లిస్ట్ ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని కోరుతూ, "మారువేషంలో వీటో" అనే పదంతో దాని ప్రస్తుత విధానాన్ని విమర్శించింది. Read more

పెన్షన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
పెన్షన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పెన్షనర్ల జాబితా నుంచి పెన్షనర్ల పేర్లను తొలగిస్తోందనీ, పేదలకు అన్యాయం చేస్తోందని ప్రతిపక్ష వైసీపీ భగ్గుమంటోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ఇలాంటి Read more

Palallo :కల్తీ పెరుగుదల: ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పు
పాలల్లో కల్తీ పెరుగుదల: ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పు

పాలల్లో కల్తీ పెరుగుదల: ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పు పాలల్లో కల్తీ – ఆరోగ్యాన్ని ముంచెత్తుతున్న మృత్యు ముంగిట నవుడికే కాదు, పశుపక్ష్యాదుల ఆరోగ్యానికి కూడా కల్తీ ప్రమాదంగా Read more

రేవంత్ నిర్ణయం ఏపీపైనా ప్రభావం
revanth, babu

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, విచారణ వంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×