cbn davos

చంద్రబాబు దావోస్ పర్యటన పై వైసీపీ సెటైర్లు

చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. ‘చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. ‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ దావోస్ వెళ్లి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప ఇన్నేళ్లలో ఒక్క అటుకుల మిల్లు, అప్పడాల మెషిన్ కూడా రాలేదు. తండ్రీకొడుకులు ప్రజా ధనంతో షికార్లు చేసి వస్తారు. జగన్ తన హయాంలో ఎలాంటి హంగామా లేకుండా దావోస్ వెళ్లారు. అప్పుడు రూ.1,26,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

వైసీపీ హయాంలో జగన్ స్వయంగా దావోస్ పర్యటనకు వెళ్లి, లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను సాధించారని, ఈ ఒప్పందాలు రాష్ట్రానికి అభివృద్ధి కలిగించాయని వైసీపీ చెప్పుకొచ్చింది. గన్ పర్యటనలపై విమర్శలు లేకుండా, బలమైన ఆర్థిక ఒప్పందాలు సాధించినట్లు వైసీపీ తెలిపింది. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన ఒప్పందాలు సాధించామని ,ఎన్నో విజయాలు సాధించామని పేర్కొన్నారు. వైసీపీ చేసిన ఈ ఆరోపణలపై టీడీపీ అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తుంది. వైసీపీ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోగా..ఉన్న కంపెనీ లు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని కౌంటర్లు స్టార్ట్ చేసారు.

Related Posts
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బ‌య్య కన్నుమూత
uke abbai

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. Read more

నెల్లూరు జిల్లాలో జికా కలకలం
zika virus

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి ఆరోగ్యంలో Read more

ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!
AP Increase in land registr

Increase in land registration chargesఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను 15% వరకు Read more

22వ వసంతంలోకి అడుగుపెట్టిన అవిభక్త కవలలు వీణా-వాణి
vaniveena

అవిభక్త కవలలు వీణా-వాణి 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్లోని శిశువిహార్ లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. కాగా 2006లో వీరిద్దరినీ వేరు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *