వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ రేసు ప్రస్తుతం రసవత్తరంగా మారింది భారత్‌పై న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా సాధించిన విజయాలతో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి టీమిండియా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వారి విజయశాతం గణనీయంగా తగ్గిపోయింది దాదాపు 6% విజయశాతం కోల్పోయిన భారత్ పరిస్థితి ఇప్పుడు సవాళ్లతో కూడుకుంది దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించడం ఆసియాలో దశాబ్దం తర్వాత టెస్టుల్లో విజయం నమోదు చేయడం వారిని నాల్గవ స్థానానికి ఎగబాకేలా చేసింది. 47.62% విజయశాతంతో ఫైనల్ బెర్తు అవకాశాలను మెరుగుపర్చుకున్న సఫారీలు తమ మిగిలిన మ్యాచ్‌లలో కూడా గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచే అవకాశాన్ని ఆశిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆసీస్ (62.50%) రెండో స్థానంలో శ్రీలంక (55.56%) మూడవ స్థానంలో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా తమ రాబోయే టెస్టు మ్యాచ్‌ల్లో శక్తివంతమైన పోటీగా మారింది.
సఫారీలకు బంగ్లాదేశ్‌తో మరో టెస్టు ఉండగా ఆ తర్వాత వారు తమ సొంతగడ్డపై శ్రీలంక పాకిస్థాన్‌లతో కీలక టెస్టులు ఆడనున్నారు స్వదేశంలో సఫారీలకు ఎదురెళ్లడం ముఖ్యంగా పాక్ శ్రీలంక జట్లకు అంత సులువు కాదు ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అయిదు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు విజయాలు సాధిస్తే వారికీ ఫైనల్ బెర్తు దాదాపు ఖాయమే మరోవైపు ఈ మార్పులు భారత్ స్థానాన్ని ప్రమాదంలోకి నెట్టాయి ఫైనల్‌కు చేరాలంటే రోహిత్ సేనకు మరిన్ని విజయాలు సాధించడం అవసరం ముందు ఉన్న న్యూజిలాండ్‌తో ఒకటి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టులు ఆడాల్సి ఉంది ముఖ్యంగా కంగారూల గడ్డపై గెలవడం అంత తేలికేం కాదు భారత్ అతి ముఖ్యమైన ఈ మ్యాచుల్లో కనీసం నాలుగు విజయాలు సాధించి ఒక మ్యాచ్ డ్రా చేసుకుంటే ఫైనల్‌కు అర్హత పొందే అవకాశం ఉంటుంది ఇతర జట్లలో న్యూజిలాండ్ (44.44%), ఇంగ్లండ్ (43.06%) వరుసగా 5వ 6వ స్థానాల్లో ఉన్నారు. అయితే బంగ్లాదేశ్ (30.56%), పాకిస్థాన్ (25.93%), వెస్టిండీస్ (18.52%) జట్లు నిష్క్రమించే దశలో ఉన్నాయి.