బస్సు ఆపలేదని కోపంతో బస్సు కండక్టర్ ఫై పాము విసిరినా వృద్ధురాలు

తెలంగాణ లో ఫ్రీ బస్సు పథకం అమల్లోకి వచ్చిన దగ్గరి నుండి బస్సు డ్రైవర్లు , కండక్టర్లు రకరకాల పరిణామాలు ఎదురుకుంటున్నారు. బస్సు ఎందుకు ఆపలేదని కొంతమంది దాడికి దిగుతుంటే..మరికొంతమంది ఏకంగా బస్సు కండక్టర్ ఫై చెప్పులు , పాములు విసురుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం నగరంలోని విద్యానగర్ లో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. బస్సు స్టాప్ కంటే ముందు బస్సు ఆపలేదని చెప్పి మహిళా కండక్టర్ ఫై ఓ వృద్ధురాలు పాము విసిరినా ఘటన చర్చగా మారింది.

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బస్సు ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా విద్యానగర్ బస్టాప్ దాటిన తర్వాత మూలపై నిల్చున్న మహిళ బస్సును ఆపాలని చెయ్యెత్తింది. కాస్త ముందుకు పోనిచ్చిన డ్రైవర్ రోడ్డు పక్కగా ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో బస్సు ఆపలేదన్న కోపంతో ఊగిపోయిన మహిళ బస్సు వెనక అద్దంపైకి బీర్ బాటిల్ విసిరింది.

బస్సు ఆగిన వెంటనే కిందికి దిగిన మహిళా కండక్టర్ నిందితురాలిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితురాలు వెంటనే తన వద్దనున్న బ్యాగ్ తెరిచి అందులోంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరింది. దీంతో భయపడిపోయిన కండక్టర్ పరుగులు తీసింది. ఈ గొడవతో అక్కడ గుమికూడిన జనం ఈ ఘటనను వీడియో తీసుకుంటే, మరికొందరు పాము వెంట పరుగులు తీశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. మరి ఆ వృద్ధురాలి బ్యాగ్ లో పాము ఎక్కడిది..ఎందుకు పామును పెట్టుకొని తిరుగుతుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Snake jih@d.!?

A drunk burkha clad woman threw a snake on a female RTC bus conductor in Vidyanagar, Hyderabad today evening.!! 🤦🏻

2 more snakes found in her bag 🤷🏻 pic.twitter.com/LH7QZZ5NZX— Gems Of KCR 2.0 (Parody) (@GemsOfKCR2) August 8, 2024