మధ్యప్రదేశ్ లో దారుణం ..పట్టపగలు రోడ్డు పక్కన మహిళపై అత్యాచారం

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్న ఘటనలు ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం..కొంతమంది ప్రేమ , పెళ్లి పేరుతో వారి కామ కోర్కెలు తీర్చుకొని వదిలేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. ఉజ్జయిని లోని కోయిలా ఫటక్ మద్యం దుకాణం దగ్గర..ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడం తో దీనిపై పోలీసులు అరా తీశారు.

వీడియోలో ఉన్న సదరు యువతిని గుర్తించి విచారించగా..పెళ్లి విషయమై మాట్లాడాలని చెప్పి..మద్యం తాగించి, ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు యువతీ పోలీసులకు పిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహిళకు మద్యం ఇచ్చి పెళ్లి చేసుకుందామని.. ఎప్పుడూ ఆమె వెంటే ఉంటానని చెప్పాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి పోలిసుల అదుపులో ఉన్నాడు.