With 7% growth in employability, India to emerge as global powerhouse for skilled talent by 2030

ఈ దశాబ్దం గ్లోబల్ టాలెంట్ మొబిలిటీలో అగ్రగామిగా భారతదేశం

వీబాక్స్ ఈటీఎస్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025, CII, Taggd, AICTE మరియు AIU భాగస్వామ్యంతో , “గ్లోబల్ టాలెంట్ మొబిలిటీ” కోసం ఒక వ్యూహాత్మక లక్ష్యంను ఆవిష్కరించింది.

న్యూఢిల్లీ : భారతీయ గ్రాడ్యుయేట్లలో ఉపాధి సామర్థ్యం ఈ సంవత్సరం 7% స్థిరమైన పెరుగుదలను చూసింది. ఇది 2025లో 54.81%కి చేరుకుంది. గత సంవత్సరం 51.25% నుంచి ఇది వృద్ధి చెందింది. భారతీయ శ్రామిక శక్తిలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండటంతో, గల్ఫ్ దేశాలు, ఆగ్నేయాసియా, యూరప్ మరియు ఆఫ్రికాలోని పరిశ్రమల డిమాండ్‌లను తీర్చడానికి భారతదేశం యొక్క యువ మరియు డైనమిక్ టాలెంట్ పూల్ తోడ్పడుతుంది. భారతదేశం యొక్క నైపుణ్యం కలిగిన నిపుణులు, ముఖ్యంగా సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక శక్తి మరియు ఏఐ , ప్రపంచ ఆవిష్కరణలు మరియు ఆర్థిక వృద్ధిని నడిపిస్తున్నారని నివేదిక హైలైట్ చేస్తుంది.

భారత నైపుణ్యాల నివేదిక చీఫ్ కన్వీనర్ మరియు ETS కంపెనీ వీబాక్స్ యొక్క సీఈఓ నిర్మల్ సింగ్ మాట్లాడుతూ..“ఈ దశాబ్దం గ్లోబల్ టాలెంట్ మొబిలిటీలో అగ్రగామిగా భారతదేశం నిలువనుంది. భారతదేశం నుండి నైపుణ్యం మరియు సర్టిఫికేట్ పొందిన ప్రతిభ భారతదేశానికి ప్రత్యేకమైన ప్రయోజనం మరియు పరపతిని అందిస్తుంది. మన వర్క్‌ఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య అంతరాలను తగ్గించడం తో పాటుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరివర్తన అవకాశాలను సృష్టించనుంది” అని అన్నారు.

సాంకేతికత, తయారీ, హెల్త్‌కేర్ మరియు ఇ-కామర్స్‌లోని సంస్థలు తాజా ప్రతిభను పొందేందుకు సన్నద్ధమవుతున్నాయని నివేదిక వెల్లడిస్తోంది. 2025కి సంబంధించిన ఇండియా హైరింగ్ ఇంటెంట్ సర్వే 15 పరిశ్రమల్లో విస్తరించి ఉన్న 1,000కి పైగా కార్పొరేషన్‌లలో ఆశావాదాన్ని ప్రదర్శిస్తుంది, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల కోసం. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ వంటి కీలక రాష్ట్రాలు అగ్రగామిగా నిలుస్తుండగా, పూణె, బెంగళూరు, ముంబై వంటి నగరాలు ప్రతిభకు కేంద్రంగా నిలుస్తున్నాయి.

Related Posts
గాజా యుద్ధం: పునఃప్రారంభంపై కీలక హెచ్చరిక
గాజా యుద్ధం పునఃప్రారంభంపై కీలక హెచ్చరిక

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శనివారం ఒక కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ, “అవసరమైతే గాజాలో యుద్ధాన్ని పునఃప్రారంభించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది” అని Read more

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు
Trump orders revoking birthright citizenship

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్న్నికల సమయంలో ఇచ్చిన హామీకి తగినట్టుగానే జన్మతః పౌరసత్వంపై వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా Read more

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) ప్రారంభం వాయిదా – 2025లో మొదలు
iml

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) ప్రారంభ సంచికను వాయిదా వేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టి20 క్రికెట్ టోర్నీ మొదట నవంబర్ 17 నుండి ప్రారంభం కావాల్సి Read more

ఇఫ్తార్ విందు ఇచ్చిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్
Vijay hosted an iftar dinne

తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. Read more