మందుబాబులుకు గుడ్ న్యూస్..ఇంటికే మద్యం

మందుబాబులకు గుడ్ న్యూస్..ఇకపై మద్యం కోసం వైన్ షాప్స్ , బార్స్ కు వెళ్లనక్కర్లేదు..ఒక్క క్లిక్ తో ఇంటికే మద్యం తీసుకరాబోతున్నారు. ఈ మేరకు స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ప్లాట్‌ఫారమ్‌లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఫుడ్ ను మాత్రమే అందించే స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ప్లాట్‌ఫారమ్‌లు ఇక నుండి మద్యం కూడా డోర్ డెలివరీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా త్వలోనే లిక్కర్ హోమ్ డెలివరీ చేయాలని మద్యం తయారీ దారులు యోచిస్తున్నారు. ఈ తరహా మద్యం హోమ్ డెలివరీ చేసే విధానం ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్ లో అమల్లో ఉండగా త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హరియాణా, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని పరిశ్రమ వర్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా బీర్, వైన్ వంటి మద్యాన్ని తక్కువ స్థాయిలో హోమ్ డెలివరీ చేయవచ్చని పేర్కొన్నది. ఈ విధానం ద్వారా లాభనష్టాలను అంచనా వేసుకుని త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతుంది.