Why are the flights going to Amritsar.. Punjab CM

ఆ విమానాలు అమృత్‌సర్‌కే ఎందుకొస్తున్నాయి..?: పంజాబ్ సీఎం

పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమన్న సీఎం

న్యూఢిల్లీ: అమెరికా నుంచి వలసదారులను తీసుకొచ్చిన విమానం గతవారం అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన విషయం విషయం తెలిసిందే. మొత్తం 104 మంది భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి వచ్చారు. తాజాగా, మరో రెండు విమానాల్లో భారతీయులను అమెరికా నుంచి వెనక్కి పంపుతున్నారు. 119 మందితో ఓ విమానం ఆదివారం అమృత్‌సర్‌ విమానాశ్రయానికి చేరుకోనుంది. ఇంకో విమానం ఎప్పుడు వస్తుందనేది స్పష్టత లేదు.

 విమానాలు అమృత్‌ సర్‌కే  పంజాబ్

వలసదారుల విమానాలను తమ రాష్ట్రానికి పంపడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రపూరితంగానే వలసదారుల విమానాలను అమృత్‌సర్‌‌కు పంపుతోందని ఆయన విమర్శించారు. పంజాబ్‌ ప్రతిష్ఠను దిగజార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఈ విమానాలను ల్యాండింగ్‌కు పంజాబ్‌నే ఎందుకు ఎంపిక చేశారని మాన్ ప్రశ్నించారు.

అమెరికా నుంచి భారతీయ వలసదారులతో బయలుదేరిన విమానం ఆదివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌‌కు చేరుకోనుంది..ఏ ప్రమాణాల ఆధారంగా విమానం ల్యాండ్ చేయడానికి అమృత్‌సర్‌ను ఎంపిక చేశారో విదేశాంగ శాఖ సమాధానం చెప్పాలి… పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే మీరు ఎంపిక చేస్తున్నారు.. డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ అయినప్పుడు మన ప్రజలకు అమెరికా అధికారులు సంకెళ్లు వేయడమేనా మన ప్రధానికి ఇచ్చిన బహుమతి అని భగవంత్ మాన్ విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పంజాబ్ పట్ల వివక్ష చూపుతోంది.. పంజాబ్‌ను ప్రతిష్ఠను దెబ్బతీసే ఏ అవకాశాన్ని వారు వదులుకోదు.. కుట్రలో భాగంగా, పంజాబ్, రాష్ట్ర ప్రజలను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు..అని ధ్వజమెత్తారు.

Related Posts
కౌశిక్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ వార్నింగ్
uttam koushik

తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేగుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కౌశిక్ Read more

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more

అమ్మకాల్లో ఆపిల్ ఐఫోన్స్‌ సరికొత్త రికార్డ్
అమ్మకాల్లో ఆపిల్ ఐఫోన్స్‌ సరికొత్త రికార్డ్

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్స్ రంగంలో ఆపిల్ ఐఫోన్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్‌లోని భద్రతా ఫీచర్స్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే Read more

జెలెన్ స్కీకి షాక్ ఇచ్చిన ట్రంప్
ట్రంప్, పుతిన్ ఉచ్చులో జెలెన్స్కీ?

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తీవ్ర వివాదస్పద నిర్ణయాలతో తరచూ వార్తలల్లో నిలుస్తున్నారు. దుందుడుకు చర్యలతో పలు దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. గ్రీన్ Read more