Who will own Ratan Tatas p

రతన్ టాటా ఆస్తి అంత ఎవరి సొంతం అవుతుంది…?

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా మరణం పట్ల ప్రతి ఒక్కరు స్పందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాప్ 34 లక్షల కోట్ల రూపాయలు. ఒక కుటుంబ సంస్థగా ఎదుగుతూ వచ్చిన టాటా గ్రూప్ నేడు ఆ సంస్థలకు నాయకత్వం వహించే తదుపరి వారసుడు ఎవరు అనే సందిగ్ధావస్థకు చేరింది. 86 సంవత్సరాల రతన్ టాటా మరణం తరువాత ఆయన వారసుడు ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది.

ముఖ్యంగా రతన్ టాటా బ్రహ్మచారి కావడంతో ఆయనకు వారసులు లేరు. అయితే ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి రతన్ టాటా 2017 లో తప్పుకొని టిసిఎస్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కు అప్పగించారు. ఇక టాటా గ్రూప్ ను నిర్వహించే పేరెంట్ కంపెనీ టాటా సన్స్ చైర్మన్ హోదాలో కూడా నటరాజన్ చంద్రశేఖరన్ ఉన్నారు.

టాటా సన్స్ లో 66% వాటాలు టాటా కుటుంబం నిర్వహించే పలు సేవా సంస్థల పేరిట ఉన్నాయి. ఇందులో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ సంస్థలు టాటా సన్స్ లో దాదాపు 50% వాటాలతో అతిపెద్ద వాటాదారులుగా ఉన్నారు. రతన్ టాటా అనంతరం ప్రస్తుతం టాటా వారసులైన లియా టాటా, మాయ టాటా, నెవిల్లే టాటా పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ నావల్ టాటా పిల్లలే లియా టాటా, మాయ టాటా, నెవిల్లే టాటా. వీరిలో లియా, మాయా ఆడపిల్లలు కాగా, నెవిల్లే టాటా మగవాడు. వీరు టాటా గ్రూప్‌లో వివిధ బాధ్యతల్లో ముందుకు సాగుతున్నారు

Related Posts
అమరావతి లో సినిమాలకు ఫుల్ డిమాండ్ – చంద్రబాబు
chandrababu

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ రంగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం భారతీయ Read more

బైడెన్‌ నిర్ణయం: ట్రంప్ అధికారంలోకి రాకముందు ఉక్రెయిన్‌కు కీలక మద్దతు
biden zelensky

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, ఇది ఉక్రెయిన్‌కు మిత్ర దేశం నుండి మరింత మద్దతును అందించడానికి Read more

తెలంగాణ గ్రూప్-2 ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌
ts group2

తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థుల పరీక్ష షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 2024, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. హాల్ టికెట్లను డిసెంబర్ Read more

యాదాద్రి పేరు మార్చిన సీఎం రేవంత్
cm revanth yadadri

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. ఆయన యాదాద్రి ఆలయ పేరు మార్చాలని నిర్ణయించారు. యాదాద్రి బదులు "యాదగిరిగుట్ట" పేరును ఏర్పాటు చేయాలని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *