డీజీపీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు ప్రారంభం
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్త డీజీపీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి జితేందర్ తాత్కాలిక డీజీపీ గా మాత్రమే ఉన్నారు. పూర్తిస్థాయి డీజీపీ నియమించాలంటే యూపిఎస్సి నిబంధనలను అనుసరించాల్సి వస్తుంది.
ఎనిమిది రాష్ట్రాల్లో తాత్కాలిక డీజీపీలు
యూపిఎస్సి నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయి డీజీపీ నియామకం కాలేదు. మొత్తం దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో తాత్కాలిక డీజీపీలు మాత్రమే కొనసాగుతున్నారు.
2006 నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
డీజీపీ నియామకాల్లో అవకతవకలు జరగడం వల్ల 2006లో ప్రకాష్ సింగ్ అనే ఐపిఎస్ అధికారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో కోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం యూపీఎస్సి కొన్ని నిబంధనలను ఖరారు చేసింది.
యూపీఎస్సి నిబంధనలు ఏమిటి?
ప్రతి రాష్ట్రం కనీసం ఐదు మంది డీజీపీ స్థాయి అధికారుల పేర్లను యూపీఎస్సికి పంపాలి. అప్పుడు యూపీఎస్సి ముగ్గురు అధికారుల పేర్లను తిరిగి రాష్ట్రానికి పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వారిలో ఒకరిని డీజీపీగా నియమించవచ్చు.
డీజీపీ అయ్యే అధికారులకు అవసరమైన అర్హతలు
- పదవీ విరమణకు కనీసం ఆరు నెలలు ఉండాలి
- నియమితుడైన వ్యక్తి కనీసం రెండు సంవత్సరాలు డీజీపీగా కొనసాగగలగాలి
- కెరీర్‌లో అవినీతి లేకుండా, విశ్వసనీయతతో పని చేసి ఉండాలి
- ఇంటెలిజెన్స్, సెంట్రల్ సర్వీసెస్ వంటి విభాగాల్లో అనుభవం ఉండాలి
ప్రస్తుతం పోటీలో ఉన్న ఐదుగురు అధికారులు
- రవిగుప్తా (1990 బ్యాచ్) – గతంలో డీజీపీగా సేవలందించిన అనుభవం ఉంది.
- జితేందర్ (1992 బ్యాచ్) – ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా ఉన్నారు
- సివి ఆనంద్ (1991 బ్యాచ్) – నగర పోలీస్ కమిషనర్, డిసెంబర్ 2025 వరకు పదవిలో ఉంటారు.
- శివధర్ రెడ్డి (1994 బ్యాచ్) – ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రస్తుతం ఉన్నారు
- సౌమ్య మిశ్ర (1994 బ్యాచ్) – మహిళా ఐపిఎస్ అధికారి, మంచి కెరీర్ ఉన్నారు
యూపీఎస్సి నుండి రాష్ట్రానికి రానున్న తుది జాబితా
ఈ ఐదుగురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సికి పంపుతుంది. తర్వాత యూపీఎస్సి వారిలో ముగ్గురిని ఎంపిక చేసి తిరిగి రాష్ట్రానికి పంపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించుతుంది.
నియామక ప్రక్రియలో గరిష్ట గడువు
డీజీపీ పదవి పదవీ విరమణకు మూడు నెలల ముందు జాబితా సిద్ధం చేసి యూపీఎస్సికి పంపాలి. అక్కడి నుంచి గరిష్టంగా మూడు నెలల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో కొత్త డీజీపీ ఎవరు అనే అంశం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
మనిషి మెదడులోకి ప్లాస్టిక్ రేణువులు అసలు ఏంటి ఈ విషయం? ప్లాస్టిక్ కాలుష్యం అనేది మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. మన రోజువారీ జీవితంలో Read more
చిరంజీవి రాజకీయ రీయంట్రీ పై చర్చ కొంతకాలంగా చిరంజీవి రాజకీయ రీయంట్రీపై చర్చ జరుగుతోంది. ఆయన మళ్ళీ రాజకీయాలలోకి రాబోతున్నారని, రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటారని, లేదా బిజెపిలో Read more