ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు హెచ్చరిక

ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా ఇతర నేరాలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంట లో ‘‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు హెచ్చరిక

అవినీతికి తావు లేదు – నేరస్తులపై కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( అన్నారు. గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా ఇతర నేరాలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంట లో ‘‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

పారిశుద్ధ్యంపై ప్రజల భాగస్వామ్యం కీలకం

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు అందరూ శ్రమించాలి. ఏపీని స్వచ్ఛాంధ్ర చేయాలని సంకల్పించాం. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. నేరస్థుల పట్ల కఠినంగా ఉంటాం. ఆడబిడ్డల జోలికి వచ్చిన వారిని వదిలేది లేదు. గంజాయి ఉత్పత్తి చేస్తే ఉపేక్షించం. గంజాయి రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతున్నాం. గత ప్రభుత్వంలో చెత్తపైనా పన్ను వేసి ప్రజలను వేధించారు. ప్రస్తుతం చెత్తను పునర్వినియోగం చేసేందుకు యోచిస్తున్నాం. చెత్త నుంచి సంపద సృష్టికి ప్రయత్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చింది.

ఆర్థిక స్థిరత్వం – పేదలకు మేలు

సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఏపీలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నాం. ప్రతినెలా పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి రూ.33 వేలకోట్ల పెన్షన్లు ఇస్తున్నామని” చెప్పారు.

Related Posts
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన గురుకుల సిబ్బంది
Gurukula staff met Deputy Chief Minister Pawan Kalyan

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప Read more

గ్రూప్‌-2 ప‌రీక్ష‌లపై ఏపీపీఎస్‌సీ క్లారిటీ
గ్రూప్‌-2 ప‌రీక్ష‌లపై ఏపీపీఎస్‌సీ క్లారిటీ

ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల‌పై ఏపీ ప‌బ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రేపు (ఆదివారం) జరగనున్న గ్రూప్-2 మెయిన్స్‌ ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా నిర్వ‌హిస్తామని స్పష్టం Read more

Andhra Pradesh MLAs: ప్రారంభం అయిన ఎమ్మెల్యే క్రీడా పోటీలు
Andhra Pradesh MLAs: ప్రారంభం అయిన ఎమ్మెల్యే క్రీడా పోటీలు

ఏపీలో ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు – మూడు రోజుల పాటు ఉత్సాహభరిత ఆటలు ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు Read more

5 జిల్లాల పరిధిలో అమరావతి ORR.. కేంద్రం గెజిట్
amaravathi ec

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 189.9 కిలోమీటర్ల మేర Read more