ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే

ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి కౌంట్‌డౌన్ మొదలైంది ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి “మినీ వరల్డ్ కప్”గా పిలిచే ఈ టోర్నీ ఇప్పుడు వివాదాలతో చర్చల్లో మారింది. ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్ దుబాయ్‌లలో జరిగే ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. అన్ని జట్లు తమ జట్లను ప్రకటించాయి షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన 5 ప్రధాన వివాదాలు మీడియాలో విపరీతంగా చర్చించబడుతున్నాయి అవి ఏమిటో చూద్దాం.

Advertisements
  1. పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా నిరాకరణ: చాలా కాలం తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది కానీ భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించింది ఆ తర్వాత ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించింది. టీమిండియా ఇప్పుడు దుబాయ్‌లోని మ్యాచ్‌లను ఆడుతుంది సెమీఫైనల్స్ ఫైనల్స్ కూడా అక్కడే జరగతాయి.
  2. పాకిస్తాన్ భారతదేశానికి రావడానికి నిరాకరించింది: భారత జట్టు పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించగా పాకిస్తాన్ కూడా భారతదేశానికి వెళ్లేందుకు నిరాకరించింది పాకిస్తాన్ కూడా హైబ్రిడ్ మోడల్‌ను కోరింది ఈ వ్యవహారం ఇద్దరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలను సృష్టించింది.
  3. ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌పై వివాదం: 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని తిరిగి స్వీకరించారు ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల క్రీడలు నిషేధించబడ్డాయి. ఇంగ్లాండ్‌లోని రాజకీయ నాయకులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని అభ్యర్థించారు అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ డిమాండ్‌ను తిరస్కరించింది.
  4. టీం ఇండియా జెర్సీపై గందరగోళం: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జట్ల జెర్సీలపై టోర్నమెంట్ నిర్వహించే దేశం పేరు ఉండటంలో సాధారణంగా అవకాసం ఉంటుంది అయితే భారత జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉండకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది తర్వాత “పాకిస్తాన్ పేరు జెర్సీపై ఉంటుంది” అని బీసీసీఐ స్పష్టం చేసింది.
  5. భారత మ్యాచ్ రిఫరీ అంపైర్ల వివాదాలు: ఛాంపియన్స్ ట్రోఫీకి అంపైర్లు మ్యాచ్ రిఫరీలను ఐసీసీ ప్రకటించింది. కానీ వాటిలో ఒక్క భారతీయుడి పేరు కూడా లేదు భారత జట్టు, నితిన్ మీనన్‌ను ఐసీసీ జాబితాలో చేర్చాలని కోరింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల నితిన్ పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించాడు. అలాగే మాజీ ఆటగాడు జవగళ్ శ్రీనాథ్ సెలవు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వివాదాలు అన్ని టోర్నమెంట్‌కు మరింత ఉత్కంఠను ఆసక్తిని తెచ్చాయి. అయితే ఇవన్నీ కూడా మరింత ప్రశ్నలకు దారితీస్తున్నాయి.
Related Posts
Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ మరోసారి హాట్ టాపిక్‌
Revanth Reddy కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ మరోసారి హాట్ టాపిక్‌

Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ మరోసారి హాట్ టాపిక్‌ తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, Read more

నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం
Nitish Kumar Reddy received

టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వస్థలానికి చేరుకున్న ఆయనకు Read more

Fire Safety : ఫైర్ సేఫ్టీ వారోత్స‌వాల్లో హైడ్రా క‌మిష‌న‌ర్ సూచ‌న‌లు
hydra fire

ఫైర్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అగ్ని ప్రమాదాల నివారణపై విశేషమైన సూచనలు చేశారు. హైడ్రా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, Read more

‘ఎక్స్’ పై సైబర్ దాడి..ఉక్రెయిన్ ను నిందిస్తున్న మస్క్
స్టార్‌లింక్ ఎంట్రీ అంత ఈజీ కాదు..నిబంధనలు పాటించాలి

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవల్లో సోమవారం అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ యూజర్లు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సోమవారం ఒక్కరోజే మూడుసార్లు సేవలు Read more

×