రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ పేసర్

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. తక్షణమే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 36 ఏళ్ల గాబ్రియెల్ విండీస్ తరఫున 59 టెస్టులు, 25 వన్డేలు, 2 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 202 వికెట్లు తీశారు. తన చివరి మ్యాచ్ గతేడాది జులైలో భారత్పైనే ఆడారు. 2012లో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.

12 ఏళ్ల కెరీర్‌లో విండీస్‌ క్రికెట్‌ కోసం త‌న‌ను తాను అంకితం చేసుకున్నాన్న‌ట్లుగా చెప్పాడు. తనకెంతో ఇష్టమైన క్రీడను అత్యున్నత స్థాయిలో ఆడటం ఎంతో ఆనందాన్ని కలిగించింద‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ ప్ర‌యాణంలో త‌న‌కు స‌హ‌క‌రించిన అంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికినా క్ల‌బ్, ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడుతాన‌ని స్ప‌ష్టం చేశాడు.