హైదరాబాద్ : వెల్‌స్పన్ ఫౌండేషన్ ఫర్ హెల్త్ & నాలెడ్జ్, ఇటీవల తెలంగాణలో నాయకత్వ నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటుగా శాస్త్రీయ ఉత్సుకతను ప్రోత్సహించడానికి రెండు ప్రభావవంతమైన కార్యక్రమాలను శివశ్రీ ఛారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి నిర్వహించింది.
కన్హా శాంతివనంలో జరిగిన రెండు రోజుల రెసిడెన్షియల్ శిక్షణలో గ్రామ సమన్వయకర్తలు మరియు మండల సమన్వయకర్తలు సహా 25 మంది ఫీల్డ్ టీమ్ సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టారు. ఈ సెషన్లలో ప్రభావవంతమైన నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్, బృందంగా కలిసి పనిచేయటం సహా , ఆకర్షణీయమైన కార్యకలాపాలు మరియు బృంద ఆటలు ఉన్నాయి. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నవారు హార్ట్‌ఫుల్‌నెస్ బృందం నిర్వహించిన ధ్యాన కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు, ఇది వారి మొత్తం అనుభవాన్ని మెరుగుపరిచింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒకరు మాట్లాడుతూ .. “ఈ శిక్షణ కార్యక్రమం సరికొత్త గా ఉండటం తో పాటుగా సుసంపన్నమైన అనుభవంగా నిలిచింది. ఆశ్రమంలోని ప్రశాంతమైన వాతావరణంతో నేర్చుకునే అద్భుతమైన అభ్యాస అనుభవంగా మార్చింది” అని అన్నారు. డిసెంబర్ 10, 2024న, షాబాద్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్ (బాలుర)లో మెగా సైన్స్ ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడు ప్రభుత్వ పాఠశాలలు భాగమయ్యాయి . ఈ ఫెస్ట్ లో 522 మంది విద్యార్థుల సృజనాత్మకత మరియు బృంద కృషిని పెంపొందించే సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) శ్రీమతి అపర్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పలువురు స్థానిక అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పాల్గొన్న విద్యార్థులందరికీ వారి శాస్త్రీయ ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహించడానికి బహుమతులు అందజేశారు. నాయకత్వం మరియు శాస్త్రీయ అభ్యాసాన్ని ప్రోత్సహించే కార్యక్రమాల ద్వారా సమాజ సాధికారతకు వెల్‌స్పన్ ఫౌండేషన్ అంకితం చేయబడింది, ఇది తెలంగాణలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.