ఒక్కటిగా 'బాహుబలి'

రెగ్యులర్ సినిమా లెవల్లో బాహుబలి రెండు భాగాలను కలిపి ఓ సినిమాగా   రిలీజ్ చేయటానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.

ఒక్క తెలుగు సినిమా స్థాయినే కాకుండా మొత్తం భారతీయ సినిమా రూపు రేఖలనే మార్చేసిన సినిమా

ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'బాహుబలి' సినిమానే అని చెప్పాలి.

దర్శకుడు ఎస్ ఎస్ రాజమోళి తెరకెక్కించిన ఈ ఎపిక్ చిత్రం ఒక గేమ్ ఛేంజర్ గా నిలిచింది

అయితే ఈ సినిమా రీరిలీజ్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తుండగా

ఆ మధ్య నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి రీరిలీజ్ ఈ ఏడాది అక్టోబర్ లో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.

ఇక TODAY జూలై 10తో బాహుబలి సినిమా వచ్చి పదేళ్లు పూర్తవుతుంది.

దీనితో చిత్ర యూనిట్ ఇప్పుడే మంచి హింట్స్ రీరిలీజ్ పై ఇస్తున్నారు.

రెగ్యులర్ సినిమా లెవల్లో బాహుబలి రెండు భాగాలను కలిపి ఓ సినిమాగా భారీ ప్రచారంతో రిలీజ్ చేయటానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.