క‌మ్మేసిన పొగ‌మంచు! ఢిల్లీ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం..

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యంతో పాటు పొగ‌మంచు నానాటికీ పెరిగిపోతూ ప‌రిస్థితి దిగ‌జారుతోంది.  గాలిలో నాణ్య‌త లోపించ‌డంతో  ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు.

వాయు కాలుష్యం ఎఫెక్ట్‌తో 10, 12 త‌ర‌గ‌తులు మిన‌హా మిగ‌తా త‌ర‌గ‌తుల వారంద‌రికీ ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే ఢిల్లీలో 50 శాతం స‌మ‌ర్థ్యంతోనే ఆఫీల‌సుల‌ను న‌డుపుతున్నారు.  నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అందించే ట్ర‌క్కుల‌ను కూడా హ‌స్తిన‌లో నిలిపివేశారు.

ఆదివారం రాత్రి 457 గా న‌మోదైన గాలి నాణ్య‌తా సూచీ (AQI )..  సోమ‌వారం ఉద‌యం మ‌రింత దిగ‌జారి 481 కి చేరింద‌ని  వాతావర‌ణ  శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.  దీంతో ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు

మంగ‌ళ‌వారం  గాలి నాణ్య‌తా సూచి (AQI ) 428 గా న‌మోదైంది.  దీంతో ఢిల్లీని పొగ‌మంచు క‌ప్పేసింది.  న‌గ‌రంలో రోడ్ల‌పై 150 మీట‌ర్ల‌ దూరంలో ఉన్న వాహ‌నాలు కూడా క‌నిపించని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో  పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్  కింద స్టేజ్ 2  చర్యలను  కఠినంగా అమలు  చేస్తున్నట్లు ప్రకటించారు.

గాలి నాణ్య‌తా సూచి    (AQI ) మ‌రింత దిగ‌జార‌డంతో ఢిల్లీ వాసులు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు.  కాలుష్య ప్రభావంతో కళ్లు మండ‌టం.. ద‌గ్గు త‌దిత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.   ఊపిరి తిత్తులు దెబ్బ‌తింటాయని ప‌లువురు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

పొగ‌మంచు మూలంగా ఢిల్లీ వాసులు మార్నింగ్ వాక్‌, ర‌న్నింగ్ వంటివి చేయ‌టం అసంభ‌వంగా మారింది.  దీంతో ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీలోని  ఆనంద్ విహార్ వద్ద గాలినాణ్య‌త శాతం  470గా,  రోహిణిలో 451గా నమోదైందని అధికారులు ప్ర‌క‌టించారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా ఢిల్లీలోని ప‌లు విమాన స‌ర్వీసులు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. దీంతో ఆయా విమాన‌యాన సంస్థ‌లు అడ్వైజ‌రీ జారీ చేశాయి.

దేశ రాజ‌ధానిలో  కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కాలుష్య నియంత్రణలను కఠినతరం చేసినప్పటికీ ప‌రిస్థితి అదుపులోకి రావ‌టం లేదు.  ఢిల్లీలో కాలుష్యం న‌గ‌రంలోప‌ల‌నే కాకుండా చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల నుండి  ఉత్పన్నమవుతుందని మంత్రి గోపాల్ రాయ్ వెల్ల‌డించారు.  వాయు కాలుష్యం న‌గ‌రం లోప‌ల  30% ,  ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల నుండి  34%  ఉత్ప‌న్న‌మ‌వుతుంద‌ని మంత్రి తెలిపారు.