jaishankar

అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం: కేంద్రం స్పష్టం

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అక్రమ వలసదారులపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దీనిపై ఓ ప్రకటనను చదివి వినిపించారు. వాళ్లు అక్రమంగా ఎలా తరలి వెళ్లారు? ఏజెంట్లు ఎవరు? అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. విదేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా నివసిస్తోన్నట్లు తేలితే- వారిని స్వదేశానికి రప్పించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలపైనే ఉంటుందని జైశంకర్ అన్నారు. అమెరికాలో బహిష్కరణ వ్యవహారాన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుందని, ఇది- 2012లో అమలులోకి వచ్చిందని అన్నారు.

ఈ అథారిటీ- కొన్ని స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్‌ను రూపొందించిందని, బహిష్కరణకు గురైన వారిని ఆ దేశమే విమానాల ద్వారా తరలించాలంటూ అక్కడి నిబంధనలు స్పష్టం చేస్తోన్నాయని జైశంకర్ అన్నారు. మహిళలు, పిల్లలను ఇందులో నుంచి మినహాయించినట్లు తెలిపారు. బహిష్కరణ ప్రక్రియ కొత్తదేమీ కాదని స్పష్టం చేశారు. స్వదేశానికి వచ్చిన అక్రమ వలసదారులు అమెరికాకు ఎలా వెళ్లగలిగారనే విషయంపై ఆరా తీయడానికి అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని, అక్కడి నుంచి సమగ్ర వివరాలను తెప్పించుకుంటోన్నా మని చెప్పారు. చట్టబద్ధంగా ఏ దేశానికైనా వెళ్లే హక్కు అందకీ ఉందన, అక్రమంగా వలస వెళ్లాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి డాక్యుమెంట్లు, అధికారిక పత్రాలు, వీసాలు.. లేకుండా అసలు వాళ్లు అమెరికాకు ఎలా వెళ్లారనే విషయంపై ఆరా తీయాలంటూ ఆదేశాలను జారీ చేసినట్లు జైశంకర్ తెలిపారు.

Related Posts
నేటి నుండి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
NTRSevalu banhd

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ సేవలను నిలిపివేస్తామని స్పష్టం Read more

గాంధీభవన్‌లో కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
Youth Congress leaders who

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో రసాభాస పరిస్థితి చోటు చేసుకుంది. సమావేశం సందర్భంగా నేతల మధ్య మాటామాటా పెరిగి తిట్టుకుంటూ, Read more

ఇండియాలో ఇసుజు మోటార్స్ 4 కొత్త టచ్ పాయింట్స్..
Isuzu Motors India adds 4 new touch points..Enters Bihar and expands footprint in India

చెన్నై: ఇసుజు మోటార్స్ లిమిటెడ్,జపాన్ వారి అనుబంధ సంస్థ అయిన ఇసుజు మోటార్స్ ఇండియా భారతదేశవ్యాప్తంగా నాలుగు కొత్త టచ్ పాయింట్స్ ప్రారంభముతో భారతదేశములో తన ఫుట్‎ప్రింట్ Read more

ఆన్‌లైన్ జూదానికి బలైన ముగ్గురు
ఆన్‌లైన్ జూదానికి బలైన ముగ్గురు

ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఈ మధ్యకాలంలో ఎంతో మందిని కబళిస్తున్న ఒక ప్రమాదకర వ్యసనం. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో, ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్స్, Read more