We will come back to power one hundred percent.. KCR

మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తాం: కేసీఆర్‌

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ మళ్లీ వెనక్కి

హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది. భేటీలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలపై కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై నేతలతో కేసీఆర్‌ చర్చించి.. శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గుర్తు చేశారు.

మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తాం

ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసు

తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని.. ప్రజల కోసం పోరాటం చేయాలని శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసునన్నారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభ

అంతేకాక.. ఈ సమావేశంలో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీల ఇంఛార్జి బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు వ్యూహ రచనపై చర్చించినట్లు తెలుస్తోంది.

Related Posts
మోడీతో గూగుల్ CEO భేటీ – డిజిటల్ ఇండియాకు మద్దతుగా గూగుల్
మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు

మోడీతో సుందర్ పిచాయ్ భేటీ: భారత్ డిజిటల్ భవిష్యత్తుపై కీలక చర్చలు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మధ్య జరిగిన Read more

ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కేంద్రం అనుమతి
Centre approves Pranab Mukh

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల ప్రణబ్ కుమార్తె కృతజ్ఞతలు తెలియజేశారు. వారి కుటుంబం స్మారక Read more

జయశంకర్ భూపాలపల్లిలో సంచరిస్తున్న పులి: వీడియో వైరల్
జయశంకర్ భూపాలపల్లిలో సంచరిస్తున్న పులి: వీడియో వైరల్

తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కొత్తపల్లిగోరి మండల కేంద్రం శివార్లలోని పంట పొలాల్లో పెద్దపులి కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. Read more

‘కస్టమర్ కేర్ మహోత్సవ్’ ను ప్రారంభించిన టాటా మోటార్స్
Tata Motors launched Customer Care Mahotsav

·ఈ దేశవ్యాప్త కార్యక్రమం 23 అక్టోబర్ నుండి 24 డిసెంబర్ 2024 వరకు నిర్వహించబడుతుంది..·యావత్ వాణిజ్య వాహనాల శ్రేణికి సంబంధించి వాహన తనిఖీలు, విలువ ఆధారిత సేవలు, Read more