ktr

కేసీఆర్ చెబితేనే కేంద్ర మంత్రిని కలిశాం: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆయన పలువురు నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశామని… యూజీసీ నిబంధనలను మార్చడంపై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశామని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా కొన్ని నిబంధనలు ఉన్నాయని అన్నారు.

గవర్నర్లకు అధికారాలు కట్టబెడుతూ రాష్ట్రాల పరిధిలో ఉన్న యూనివర్సిటీల్లోని నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తమ అభిప్రాయాలను యూజీసీకి కూడా తెలిపామని చెప్పారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన నేతలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ అయ్యాయని… వారిపై అనర్హత వేటు పడాల్సిందేనని అన్నారు.

Related Posts
TTD : తెలంగాణ ప్ర‌జల‌కు టీటీడీ శుభ‌వార్త‌ చెప్పింది
TTD తెలంగాణ ప్ర‌జల‌కు టీటీడీ శుభ‌వార్త‌ చెప్పింది

TTD : తెలంగాణ ప్ర‌జల‌కు టీటీడీ శుభ‌వార్త‌ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త అందించింది. ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు Read more

ఎన్ని కేసులు పెట్టినా భయపడం : ఎమ్మెల్సీ కవిత
mlc kavitha

కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నది జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మా నాయకులను జైల్లో పెట్టడమే పనిగా Read more

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది – భట్టి విక్రమార్క
bhatti budjet

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని Read more

దావోస్ వేదికపై తెలంగాణ సరికొత్త రికార్డు
TG secures Rs 45,000 crore

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం మరొక కొత్త మైలురాయిని సాధించింది. రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో రూ.45,500 కోట్ల భారీ పెట్టుబడుల Read more