ఆప్‌, కాంగ్రెస్‌ల పొత్తు గురించి మాకేమీ తెలియదు: హర్యానా ఆప్‌ చీఫ్‌

We know nothing about AAP-Congress alliance.. Haryana AAP chief

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌, హర్యానాల్లో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. ప్రత్యేకించి హర్యానా రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి.

అక్కడ బీజేపీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్‌లు, ఆప్‌లు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమయ్యాయని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్‌ నేతలు, ఆప్‌ నేతలు సీట్ల సర్దుబాటుపై చర్చించుకున్నారని కూడా ఊహాగానాలొచ్చాయి. ఈ తరుణంలో హర్యానా ఆప్‌ పార్టీ చీఫ్‌ సుశీల్‌ గుప్తా ‘తనకు కూటమి గురించి గానీ.. అసలు పొత్తుల గురించి కానీ తెలియదు అని’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సుశీల్‌ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామని, ఆ పార్టీతో పొత్తు గురించి కానీ ఇప్పటివరకూ అధిష్టానం నుంచి మాకెటువంటి సమాచారం లేదు. హర్యానాలో 90 సీట్లలో ఆప్‌ పోటీ చేయాలనుకుంటోంది. ఈరోజు సాయంత్రం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు.