dil raju svm

ఈ విజయం మాకు ముందే తెలుసు – దిల్ రాజు

వెంకటేష్ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిన్న సంక్రాంతి సందర్బంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ కు ముందే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ మూవీ..మొదటి ఆట తో అదే టాక్ రావడం తో మేకర్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో వెంకటేశ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్ రాజు, శిరీశ్ తదితరులు సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు.

Advertisements

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ప్యాక్డ్ థియేటర్స్‌లో చూసినప్పుడు ఆ ఫన్ వేరుగా ఉంటుందన్నారు. ‘అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్నటి నుంచి ఈ సినిమాకి వస్తున్న వైబ్ మాకు అర్ధమైయింది. ఆడియన్స్ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారని తెలిసింది. అమెరికా నుంచి అమలాపురం, ఆస్ట్రేలియా నుంచి అనకాపల్లి.. ఇలా షోలు పూర్తయిన వెంటనే బ్లాక్ బస్టర్ పొంగల్ అనే రిపోర్ట్స్ వచ్చేశాయి. సినిమాలో నాన్ స్టాప్‌గా నవ్వులు ఎంజాయ్ చేస్తున్నారు. మా కాంబినేషన్‌లో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్. ఎఫ్ 2 ని వారంలో సింపుల్‌గా దాటేసి అద్భుతాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేసిన అనిల్‌కి, వెంకటేశ్ ‌కి, హీరోయిన్స్‌కి, ప్రేక్షులందరికీ థాంక్స్. నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. కచ్చితంగా థియేటర్స్‌లోనే చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్యాక్డ్ థియేటర్స్‌లో చూసినప్పుడు ఆ ఫన్ వేరుగా వుంటుంది’ అని దిల్ రాజు అన్నారు.

Related Posts
హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..
Hindupuram Municipality won by TDP

అమరావతి: హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతుతో ఆరో వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. Read more

న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్
: బైడెన్ పాలనలో పెరిగిన వాణిజ్య లోటు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20 మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. ఈ నిర్ణయం అమెరికా రాజకీయ Read more

త్వరలోనే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్: చంద్రబాబు
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

అమరావతి: సీఎం చంద్రబాబు ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ..రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎన్డీయే పక్షాలు Read more

మణిపుర్ కు వెళ్లండి మోదీజీ.. రాహుల్ వినతి
modi rahul

మణిపుర్లో పర్యటించి హింసాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని PM మోదీని రాహుల్ గాంధీ మరోసారి కోరారు. మణిపుర్లో మళ్లీ హింస చెలరేగడంపై ఆయన ఆందోళన Read more

×