తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణా ప్రభుత్వ స్టాండ్ ను ప్రకటించి, డీ లిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర వైఖరి మారాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజక వర్గాల పునర్విభజన – డీలిమిటేషన్ విధి విధానాలలో మార్పులు చేయాలని సూచించారు.

శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ తీర్మానం
శాసన సభలో డీ లిమిటేషన్ పై తీర్మానం ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు రాష్ట్రంలో శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభాలెక్కలకు అనుగుణంగా SC, ST స్థానాలను పెంచాలనీ కేంద్రాన్ని ఆయన కోరారు.
దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ తో నష్టం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజక వర్గాల పెంపు పైన చర్చ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇందిరాగాంధీ ఆమోదించలేదన్న సీఎం రేవంత్ గతంలో ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
కడ్బందీగా కుటుంబ నియంత్రణ అమలు
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై రేవంత్ ఆందోళన దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, ఫలితంగా రాష్ట్రాలకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ విధానాన్ని సమగ్రంగా అమలు చేసినందుకు తమకే బెనిఫిట్ జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చట్టసభలలో 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.