'Waqf Amendment Bill 2024' before Lok Sabha today

నేడు లోక్‌సభ ముందుకు ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ‘వక్ఫ్‌ సవరణ బిల్లు-2024’పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక సోమవారం లోక్‌సభ ముందుకు రాబోతున్నది. ఈ బిల్లులో 14 నిబంధనల్లో.. 25 సవరణలు చేశారు. మొత్తం 655 పేజీల బిల్లు ఉంది. దీన్ని జనవరి 30న లోక్‌సభ స్వీకర్‌కి జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ ఇచ్చారు. అందువల్ల ఇవాళ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఇక, జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్‌, బీజేపీ ఎంపీ సంజయ్‌ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. జేపీసీ ముందు ఇచ్చిన సాక్ష్యాల రికార్డ్‌ను కూడా సభలో వారు ప్రవేశపెట్టబోతున్నారు.

Advertisements

ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. ఈ జేపీసీలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. అంటే.. ఈ బిల్లు పట్ల ప్రతిపక్షాలు కూడా అనుకూలంగా ఉన్నట్లే అని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి జేపీసీలో.. ప్రతిపక్ష నేతలు.. 44 మార్పులను సూచించారు. వాటిని జేపీసీ ఛైర్మన్ ఒప్పుకోలేదు. అదే సమయంలో.. ఎన్టీయే పక్షాల సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలకు మాత్రం జేపీసీ ఆమోదం తెలిపింది. వీటికి ఎన్డీయేలోని 16 మంది సభ్యులు ఆమోదం తెలపగా.. విపక్షాలకు చెందిన 10 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అందువల్ల ఈ బిల్లు లోక్‌సభకు వచ్చినప్పుడు.. రచ్చ రేగే అవకాశాలు ఉన్నాయి.

image

కాగా, జనవరి 29న, 655 పేజీల జేపీసీ నివేదికను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. ఇందులో బీజేపీ సభ్యులు ఇచ్చిన సూచనలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు సూచించిన సవరణలు తిరస్కరించబడ్డాయి. అంతకుముందు జేపీసీ సమావేశంలో, ముసాయిదా బిల్లు, సవరణలను మెజారిటీ సభ్యులు ఆమోదించారు. జేపీసీ సభ్యుల మధ్య ఓటింగ్ జరిగింది. సవరించిన బిల్లుకు అనుకూలంగా 16 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు ఈ ముసాయిదాతో తమ విభేదాలను వ్యక్తం చేసి, దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తుది నివేదికను అధ్యయనం చేయడానికి చాలా తక్కువ సమయం ఇచ్చారని పలువురు అన్నారు.

Related Posts
పోలీస్ అధికారులతో హోంమంత్రి అనిత భేటీ
anitha DGP

హోంమంత్రి వంగలపూడి అనిత మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో Read more

ఖతార్ అమీర్‌కు ప్రధాని మోదీ స్వాగతం
ఖతార్ అమీర్‌కు ప్రధాని మోదీ స్వాగతం

ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపడానికి హైదరాబాద్ హౌస్‌లో చేరారు. ఈ సమావేశం Read more

West Bengal : వక్ఫ్ చట్టంపై బెంగాల్‌లో ఆందోళనలు.. ముగ్గురు మృతి
West Bengal వక్ఫ్ చట్టంపై బెంగాల్‌లో ఆందోళనలు ముగ్గురు మృతి

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.మాల్డా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనలు తీవ్రంగా నమోదయ్యాయి.ప్రజలు రోడ్లపైకి వచ్చి బంద్‌లు, రాస్తారోకోలు Read more

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
vaa

అమరావతి : ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో, టీడీపీ అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు Read more

×