వోల్టా మరియు ఓహెచ్ఎమ్ ఆటోమోటివ్ భాగస్వామ్యం

హైదరాబాద్ లో చౌకైన, పర్యావరణానికి అనుకూలమైన, మరియు విలాసవంతమైన ప్రయాణాలను అందించేందుకు సిద్ధం

Volta and OHM Automotive Partnership

హైదరాబాద్: వోల్టా, రైడ్ బుకింగ్ యాప్ వ్యవస్థాపకుడు షషికాంత్ కనపర్తి మరియు  సిఇఒ  రాజా విక్రమ్  నేతృత్వంలోని వినూత్న రైడ్-హైలింగ్ యాప్ ,ఓహెచ్ఎమ్ ఆటోమోటివ్‌తో కలిసి కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా అందరికీ విలాసవంతమైన, సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల రవాణా సేవలను అందించడంలో ముందడుగు వేసింది. ముఖ్యంగా, ఎయిర్‌పోర్ట్‌కి కేవలం ₹799 నుండి ప్రారంభం అయ్యే రైడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, వోల్టా మరియు ఓహెచ్ఎమ్ నగరంలో సులభమైన స్థానిక రైడ్‌లను కూడా అందించనున్నాయి..
 
నిర్మల్ రెడ్డి మరియు కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని ఓహెచ్ఎమ్ ఆటోమోటివ్, జిఎమ్‌ఆర్ అనుమతించిన ఎయిర్‌పోర్ట్ సిటీ సేవల కోసం,  మరియు అంతర్గత నగర రవాణా కోసం ఓహెచ్ఎమ్ ఎలక్ట్రిక్ క్యాబ్‌లను ప్రారంభించింది. 600 కంటే ఎక్కువ వాహనాలతో, ఓహెచ్ఎమ్ పర్యావరణ హిత రవాణా పరిష్కారాలను అందించడంలో ముందుంది. ఈ ఎలక్ట్రిక్ క్యాబ్‌లు సౌకర్యవంతమైన సీట్లు, శుభ్రమైన వాతావరణంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ప్రయాణికులకు సేవలను అందిస్తున్నాము.
 
ఈ భాగస్వామ్యం హైదరాబాద్ లో రవాణా విధానంలో మార్పు తీసుకురాగలదు. వోల్టా మరియు ఓహెచ్ఎమ్ కలిసి అందించే ప్రయాణాలు సౌకర్యం మరియు విలాసం గా మాత్రమే కాకుండా, పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. అందుబాటు పై కేంద్రీకరిస్తూ, ప్రయాణికులు ఇప్పుడు అధిక ఖర్చు లేకుండా నాణ్యమైన ప్రయాణాన్ని అనుభవించవచ్చు.
 
“హైదరాబాద్ రవాణా రంగంలో కొత్త మార్పునీ తీసుకురావడమే మా లక్ష్యం. ఎయిర్‌పోర్ట్ రైడ్‌లు కేవలం ₹799 నుండి అందుబాటులోకి తెచ్చినందుకు ఆనందంగా ఉంది” అని వోల్టా స్థాపకుడు షషికాంత్ కనపర్తి తెలిపారు.
 
ఇక ఓహెచ్ఎమ్ ఆటోమోటివ్ వ్యవస్థాపకుడు నిర్మల్ రెడ్డి మాట్లాడుతూ, “మా కస్టమర్‌లకు శుభ్రమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాలను అందించడం మా మిషన్. వోల్టాతో భాగస్వామ్యం ద్వారా మా సేవలను మరింత విస్తరించగలుగుతున్నాము. ఈ భాగస్వామ్యం సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుందని మేము ఆశిస్తున్నాము” అన్నారు.