వివేకా హత్య కేసు..సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

Affidavit: వివేకా హత్య కేసు..సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

Affidavit : ఏపీలో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే ఈ కేసులో ఆయన పాత్రను నిర్ధారించేలా ఏపీ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

Advertisements
వివేకా హత్య కేసు..సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

అఫిడవిట్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు

అఫిడవిట్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తు విషయాలతో విచారణాధికారి నివేదిక ఇచ్చారు. పులివెందుల కోర్టుకు ఇచ్చిన నివేదికను జత చేసి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు అవినాష్‌రెడ్డి ప్రయత్నించారు. సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని చూశారు. అందులో భాగంగానే సీబీఐ అధికారి రామ్‌సింగ్‌, సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు అని అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

12 రోజుల్లోనే కట్టు కథలు అల్లి

వివేకా పీఏ కృష్ణారెడ్డిని రాంసింగ్ ఎప్పుడూ విచారించలేదని తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి అవినాశ్, ఆయన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని కృష్ణారెడ్డి చెప్పిన దానిలో నిజం లేదని తెలిపింది. ఏఎస్ఐజీ రామకృష్ణారెడ్డి నివాసంలో తతంగం నడిపారని కేవలం 12 రోజుల్లోనే కట్టు కథలు అల్లి రాంసింగ్, సునీత, నర్రెడ్డిలపై కేసులు నమోదు చేశారని చెప్పింది. తన ఫిర్యాదును బలపరిచే ఒక్క ఆధారాన్ని కూడా కృష్ణారెడ్డి సమర్పించలేకపోయారని తెలిపింది.

Related Posts
అబద్ధాల అడ్డ అరవింద్ కేజ్రీవాల్: జేపి నడ్డా
అబద్ధాల అడ్డ అరవింద్ కేజ్రీవాల్: జేపి నడ్డా

బిజెపి చీఫ్ జెపి నడ్డా, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి మరియు మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు, ఆయనను "అబద్ధాల ఎన్సైక్లోపీడియా" అని అభివర్ణించారు. అదే సమయంలో ఫిబ్రవరి 5న Read more

ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ
rtc

పల్నాడు జిల్లా…ఈపూరు ఆర్టీసీ బస్సులో పరుసు కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈపూరు Read more

జగన్ భారీ అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారు:బొలిశెట్టి శ్రీనివాస్
జగన్ భారీ అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారు:బొలిశెట్టి శ్రీనివాస్

సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కృషితో ఎంపీగానో, ఎమ్మెల్యేగానో ఎదగలేదని జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జగన్ Read more

సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
Army recruitment rally

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం ఇండియన్ ఆర్మీ అగ్నివీర్రా నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారికంగా ప్రకటన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×