Visited the family members of the murdered student YCP MP YS Avinash Reddy

మాటల్లో చెప్పలేని అమానుషం ఇది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

అమరావతి: కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు కూడా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు.. మాటల్లో చెప్పలేని అమానుషం ఇది.. 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశామని గుర్తుచేశారు. ఈ నాలుగు మాసాల్లో 74 సంఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా..? అని మండిపడ్డారు. హోం మంత్రి అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి పాప చనిపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలి.. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో స్పాట్ కి వెళ్ళేవారు.. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది.. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది.. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోందని తెలిపారు.

Related Posts
కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ
కేంద్ర మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ

161 ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, వన్యప్రాణుల సంరక్షణ చట్టాల కింద 38 ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ Read more

వర్మపై ఒకటి , రెండు కాదు ఏకంగా 9 కేసుల నమోదు
varma

సినీ డైరెక్టర్ , వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి , రెండు కాదు ఏకంగా 09 Read more

హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్..!
KTR Quash Petition in High Court.

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ తనపై Read more

తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపు
తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ ధరల పెంపు

రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ ధరల పెంపును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అవుతున్న 'గేమ్ ఛేంజర్' Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *