విశాఖ స్టేడియం పేరు మార్పు

Vishaka Stadium: విశాఖ స్టేడియం పేరు మార్పు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పేర్ల మార్పు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏపీ కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా జిల్లాలు, మున్సిపాలిటీలు, స్టేడియంల పేర్ల మార్పు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది.

Advertisements

వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

ఇటీవల ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చుతూ, దానిని ‘వైఎస్ఆర్ కడప జిల్లా’గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది వైసీపీ శ్రేణులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ నిర్ణయంతో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.అదేవిధంగా, కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును ‘తాడిగడప మున్సిపాలిటి’గా మార్చారు. ఈ మార్పును వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

విశాఖపట్నం స్టేడియం పేరు మార్పు

విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ – వీడీసీఏ స్టేడియం పేరు మార్చారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వైఎస్ఆర్ ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియం పేరును అధికారులు ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంగా మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ అనే పదం తొలగించి కేవలం ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రికి రాత్రే డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా మార్చారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైఎస్ఆర్ పేరును కూడా గతంలో తొలగించారని,మహా నేతపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తోంది.

మరోవైపు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చాలా ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును కూడా వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ మార్చిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్ పేరుతో జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి సర్కారు కూడా గత ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చింది. సంఘ సంస్కర్తలు, స్వాతంత్రోద్యమ నాయకుల పేర్లతో నామకరణం చేసింది. అలాగే ఇటీవల వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు, తాడిగడప మున్సిపాలిటీ పేరును మార్చుతూ నిర్ణయం తీసుకుంది.

Related Posts
Indians : యూఏఈ క్షమాభిక్ష వెనుక ఉద్దేశం ఏముంది ?
Indians యూఏఈ క్షమాభిక్ష వెనుక ఉద్దేశం ఏముంది

Indians : యూఏఈ క్షమాభిక్ష వెనుక ఉద్దేశం ఏముంది ? పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ Read more

రేవంత్ ఇలాకాలో కేటీఆర్ సవాల్
KTR SAVAL

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టింది. నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన ఈ దీక్షలో Read more

ట్రంప్‌తో భేటీలో ప్రధాని హుందాగా నడుచుకున్నారు: శశిథరూర్
PM behaved soberly in meeting with Trump.. Shashi Tharoor

అమెరికా విధించే టారిఫ్‌పై తొందరపడకూడదన్న శశిథరూర్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో Read more

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ – TS కు కేంద్రం సహకారం అందిస్తుందా?
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ - తెలంగాణకు కేంద్రం సహకారం అందిస్తుందా?

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ – తెలంగాణకు కేంద్రం సహకారం అందిస్తుందా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×