విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

Visakha local MLC by-election notification release

అమరావతి: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక కు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. ఈరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈనెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రభుత్వ సెలవు రోజుల్లో మినహా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ దాఖలు చేయవచ్చు. నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండనుంది.

ఈ ఎన్నికల్లో విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. ఆగస్టు 06 నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేష్ల స్వీకరణ 13 వరకు కొనసాగుతుంది. 14వ తేదీన స్క్రూట్నీ ఉంటుంది. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజు తుది అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సు పద్దతిలోనే వినియోగిస్తామని తెలిపారు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 03న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తం ఓటర్లు 838 మంది ఉన్నారు.