రేపే వినాయక చవితి.. విగ్రహం ఏ సమయంలో పెట్టాలంటే..?

ఈ ఏడాది చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఉంటుందని పండితులు తెలిపారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం 7నే (శనివారం) వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉ.11.03 గంటల నుంచి మ.1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం 6.22 గంటల నుంచి రా.7.30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు.

ఇక అన్ని ప్రభుత్వాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలని సూచించడం తో. కొన్నిచోట్ల వివిధ వస్తువులతో తయారుచేసిన గణనాథులను సైతం ప్రతిష్ఠిస్తుంటారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో మాత్రం ఇండియాలోనే తొలిసారి బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్యను రూపొందిస్తున్నారు. రాజస్థాన్ నుంచి స్పెషల్ గా 20 టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చారు. దీనికి రూ.50లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. మరొకొన్ని చోట్ల పుష్పరాజ్ -శ్రీవల్లి గెటప్ లో ఉన్న గణనాథులు , వరల్డ్ కప్ రూపంలో దర్శనం ఇస్తున్నాయి.