villagers rushed the pregnant woman to the hospital in Doli

డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..

విశాఖ : స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రపంచం ఆధునిక పోకడలకు అనుసరిస్తున్నా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇప్పటికి కూడా వారికి సరైన వైద్యం అందుబాటులో ఉండడం లేదు. ఇక గర్భిణీల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటుంది. నొప్పులు ప్రారంభించిన వెంటనే కొన్ని గంటల పాటు గర్భిణీ మహిళను డోలిలో కట్టుకొని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రసవమైన ఘటనలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డ కూడా మృతి చెందడం జరిగింది. తాజాగా మంగళవారం నాడు దేవరపల్లి మండలం బోడిగరువు గ్రామంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న సాహూ శ్రావణి అనే గర్భిణీ ని డోలి కట్టి చిత్తడి కాలిబాటను, పొంగిపొర్లుతున్న వాగును దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లిన గిరిజనులు. ఈ డోలి కష్టాలు తొలగించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

Related Posts
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో గుడివాడ నియోజకవర్గంలో నీటి నమూనాల సేకరణ
pk

‘పల్లె పండుగ’ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గుడివాడ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలపై స్పందించి ఆదేశాలు జారీ చేశారు. గుడివాడ Read more

డిపోల ప్రైవేటీకరణ పై TGSRTC క్లారిటీ
TSRTC Clarity on Privatizat

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఎలక్ట్రిక్ బస్సుల పేరిట డిపోల ప్రైవేటీకరణ జరుగుతోందన్న ప్రచారాన్ని ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ మినహా ఇతర కార్యకలాపాలు మొత్తం ఆర్టీసీ Read more

బీరెన్‌సింగ్‌ రాజీనామా.
బీరెన్‌సింగ్‌ రాజీనామా.

మణిపూర్‌ సీఎం తన పదవికి రాజీనామా చేశారు. మణిపూర్ లో జరుగుతున్న జాతుల మధ్య ఘర్షణలను ఆయన ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలోని గొంతుకు ఆయన గొంతుకు 93 Read more

వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల
వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల

భవిష్యత్తులో వరదల నుంచి విజయవాడను కాపాడుతాం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో గత సెప్టెంబరులో విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకోవడం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *