Vijayasai Reddy resignation from Rajya Sabha membership

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, వైఎస్ జగన్ అత్యంత ఆప్తుడు అయిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేసేశారు. ఈనెల 24న రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలో భాగంగా శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Vijayasai Reddy resignation from Rajya Sabha membership
Vijayasai Reddy resignation from Rajya Sabha membership

అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి చెప్పారు. ఉపరాష్ట్రపతికి తన రాజీనామా అందించాననీ, తన రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారని చెప్పారాయన. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడాననీ, ఆయనతో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానని విజయసాయి వివరించారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని విజయసాయరెడ్డి చెప్పారు. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. తన పిల్లల సాక్షిగా కాకినాడ పోర్ట్ వ్యవహారంతో ఏం సంబంధ లేదన్నారు. కాగా, విజయసాయిరెడ్డిని 2016లో వైసీపీ రాజ్యసభకు పంపించింది. 2022లో వైసీపీ అధినేత జగన్ మరోసారి విజయసాయిరెడ్డికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు. ఆయన పదవీ కాలం 2028 వరకు ఉంది. కానీ మూడేళ్ల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామాఇది ఇలా ఉంటే వైసిపిలో ఉంటూ ఆ పార్టీలో నంబర్ టూ గా కూడా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానంటూ నిన్న ట్విట్ చేశారు..దీని వెనుక ఎలాంటి కారణం లేదన్నారు. . ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని.జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ ,రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా.

కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలుటీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అంటూ త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ పోస్ట్ చేశారు.

Related Posts
ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్‌ రెడ్డి
BLN Reddy attended the ACB inquiry

హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A-3 గా ఉన్న హెచ్‌ఎండీ మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో Read more

ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు..
Lokayukta notice to Chief Minister Siddaramaiah

బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు Read more

ప్రయాణికులకు శుభవార్త.. డబ్బులు చెల్లించకుండా రైలు టిక్కెట్
indian railways

దేశంలో భారతీయ రైల్వే సంస్థ కోట్ల మంది ప్రయాణికులను రోజూ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. దశాబ్ధాలుగా తక్కువ ఖర్చులో దూర ప్రయాణాలు చేసేందుకు ఈ ప్రభుత్వ సంస్థ Read more

డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి కీలక ప్రకటన
Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డిసెంబర్ 8 (ఆదివారం) జరిగిన ప్రకటనలో, ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధాన్ని ఆపాలని, వెంటనే కాల్పుల ఆపుదల మరియు చర్చలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *