పాదయాత్రకు సిద్దమైన తమిళ్ హీరో విజయ్

తమిళనాట హీరో విజయ్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఇప్పటివరకు సినిమాల ద్వారా అనేక రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఆయన..ఇప్పుడు రాజకీయ పరంగా కూడా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు . ఉదయనిధి స్టాలిన్ త్వరలో డిప్యూటీ సిఎం పదవీ అనే ప్రచారం నేపధ్యంలో..విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యాడు.

ఇప్పటి వరకు ఎవరు కూడా పాదయాత్ర చేసిన దాఖలు లేవు..అలాంటిది ఫస్ట్ టైం విజయ్ పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యి..వార్తల్లో నిలిచాడు. 100 నియోజకవర్గాలు కలుపుతూ పాదయాత్రకు ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు పార్టీని ప్రకటించారు విజయ్‌. 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే… తొలి సారిగా పాదయాత్ర కు సిద్ధమవుతున్నాడు.