Vijay Deverakonda విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ నుంచి కీలక అప్డేట్

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ నుంచి కీలక అప్డేట్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు ప్రాజెక్ట్ మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు‘కింగ్‌డమ్’ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. వారి ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతా ద్వారా “డబ్బింగ్ వేగంగా జరుగుతోంది. ఫస్ట్ హాఫ్ పూర్తయింది మే 30న థియేటర్లలో మంత్రిముగ్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అంటూ పోస్టు చేశారు.ఈ చిత్రం మొదట VD12 టైటిల్‌తో ప్రమోట్ అయ్యింది.

Advertisements
Vijay Deverakonda విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ నుంచి కీలక అప్డేట్
Vijay Deverakonda విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ నుంచి కీలక అప్డేట్

కానీ ‘కింగ్‌డమ్’ అనే శక్తివంతమైన టైటిల్‌కి మారడంతో ఆసక్తి మరింత పెరిగింది రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కి విశేష స్పందన లభించింది 24 గంటల్లోనే కోటి వ్యూస్‌ను దాటి దుమ్ము రేపింది.టీజర్‌లో విజయ్ దేవరకొండ ఓ న్యూ లుక్‌తో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు సిక్స్ ప్యాక్, గంభీరమైన స్వభావం, ఫైట్స్‌తో ఆయన పాత్రలో కొత్తదనం కనిపిస్తోంది. “ద్రోహం నీడల నుంచి ఓ రాజు ఉదయిస్తాడు” అనే ట్యాగ్‌లైన్ టీజర్‌కి హైలైట్ అయింది.ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి జైలు బ్యాక్‌డ్రాప్‌లో కీలక సన్నివేశాలు ఉండబోతున్నాయి.

ఇది రొటీన్ యాక్షన్ మూవీ కాదని ఇప్పటికే టీజర్ చెప్పేసింది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది సినిమా టెక్నికల్ టీమ్ కూడా బలంగా ఉంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. నీరజ్ కోన కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. విజయ్ బిన్ని కొరియోగ్రఫీ చూస్తున్నారు. యాక్షన్ పార్ట్ కోసం యాన్నిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ లాంటి స్టంట్ మాస్టర్లు పని చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి కావడంతో మిగతా పార్ట్‌కి స్పీడ్ పెరిగిందని తెలుస్తోంది. మొత్తానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి ఇది డబుల్ థ్రిల్. మే 30న థియేటర్లలో ‘కింగ్‌డమ్’ కలెక్షన్ల రాజుగా మారేలా కనిపిస్తోంది.

Read Also : ILaiyaraaja: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ నిర్మాతలకు లీగల్ నోటీసులు జారీ చేసిన ఇళయరాజా

Related Posts
మృణాల్‌ ఠాకూర్‌ రివ్యూ!
మృణాల్ ఠాకూర్ ‘ఎమర్జెన్సీ’ మూవీ రివ్యూ – కంగనా నటన, కథపై ఆమె స్పందన

కంగనా రనౌత్‌ నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ . ఎన్నో వాయిదాల తర్వాత జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను వీక్షించినట్లు హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ Read more

జాన్వీ కపూర్‌లో అందం లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
జాన్వీ కపూర్‌లో అందం లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

శ్రీదేవి అంటే ఆర్జీవీకి అపారమైన గౌరవం. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ఆమె గురించి గొప్పగా చెప్పే ఆయన,ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్నారు. అందం, అభినయం కలయికగా ఉన్న Read more

L2 Empuran: ‘ఎల్ 2 ఎంపురాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు
L2 Empuran: 'ఎల్ 2 ఎంపురాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు

ప్రతిష్టాత్మక బాక్సాఫీస్ రికార్డులు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎల్ 2 ఎంపురాన్' ఇప్పుడు సినిమా ప్రేమికుల Read more

తమన్నా భాటియా: మల్లన్న క్షేత్రంలో నాగసాధుగా తమన్నా లుక్‌ చూశారా?
tamanna.jpg

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓదెల-2' చిత్రం, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో తమన్నా ఎంతో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నది. ఇప్పటి వరకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×