జానీ మాస్టర్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టనున్న బాధితులు..?

మహిళా డాన్సర్ ఫై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన నేపథ్యంలో ఆయన బాధితులు మరింత మంది బయటికి రానున్నట్లు సమాచారం. జానీ చేసిన పనుల గురించి మరో ఇద్దరు డాన్సర్లు షాకింగ్ విషయాలు వెల్లడించనున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఆయన చాలా మంది మహిళా అసిస్టెంట్లను ఇలాగే ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది.

లైంగిక వేధింపుల కేసులు అరెస్ట్ అయినా జానీ మాస్టర్..తన తప్పును ఇప్పుకున్నాడు. అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు ఈరోజు ఉప్పర్ పల్లి కోర్ట్ లో హాజరు పరచగా..కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తరుణంలో జానీ ని చర్ల పల్లి జైలు కు తరలించారు. ఈ సందర్బంగా పోలీస్ రిమాండ్ లో కీలక విషయాలను పొందుపరిచారు పోలీసులు.

దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆ యువతిని తన దగ్గర అసిస్టెంట్‌గా చేరుకున్నారని తెలిసింది. 2020లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో ఒప్పుకున్నారని తెలుస్తోంది. తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు ఆ యువతి వయస్సు 16 సంవత్సరాలే అని పోలీసులు తేల్చారు. గత నాలుగేళ్లుగా బాధితురాలిపై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో ఉందని తెలుస్తోంది.