వెర్సుని ఇండియా వారి సరి కొత్త ప్రీతి జోడియాక్

Versuni India brand new Preethi Zodiac

హైదరాబాద్‌: ఇండియా, వెర్సుని ఇండియా హౌస్‌కు చెందిన ప్రముఖ మిక్సర్ గ్రైండర్ బ్రాండ్ ప్రీతి కిచెన్ అప్లయెన్సెస్, నేడు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దాని ఫ్లాగ్‌షిప్ మరియు పవర్-ప్యాక్డ్ మిక్సర్ గ్రైండర్ పేరును నమోదు చేసుకుంది. ప్రీతి జోడియాక్కు ఇది ఒక సరికొత్త మైలురాయి. ధృఢమైన పదార్థాలను గ్రైండ్ చేయగల అత్యంత శక్తివంతమైన మిక్సర్ గ్రైండర్‌గా గుర్తింపుతో పాటు ఆవిష్కరణ, నాణ్యత మరియు పనితీరు పట్ల ప్రీతి అంకితభావానికి ఈ గుర్తింపు నిదర్శనం. ప్రీతి జోడియాక్ ఆకట్టుకునే నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు, బ్రాండ్ నాలుగు ప్రధాన నగరాల్లో పరికరాన్ని అంతిమ పరీక్షలో ఉంచేందుకు వివిధ నేపథ్యాలకు చెందిన కొచ్చి, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్- నగరాల నుంచి 120 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లనుతనతో చేర్చుకుంది. వీరు ఇటుకలు, కలపతో పాటు సుగంధ ద్రవ్యాలు మరియు మరెన్నో కఠినమైన పదార్థాలను పొడి చేసే సవాలును స్వీకరించారు. జోడియాక్ సామర్థ్యం ఈ ప్రదర్శన ద్వారా దాని అసాధారణమైన శక్తిని మరియు మన్నికను నిరూపణ చేయడమే కాకుండా విస్తృతస్థాయిలో ప్రశంసలను దక్కించుకుంది. ఈ గుర్తింపు పరికరం చూపించే అసమానమైన పనితీరును, విశ్వసనీయతను చాటిచెప్పింది. పోటీ మార్కెట్‌లో దానిని ఇతర ఉత్పత్తుల కన్నా ప్రత్యేకంగా నిలిపేలా చేసింది. ఈ సవాలును భారత్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు చెందిన న్యాయనిర్ణేతలు వివేక్ ఆర్ నాయర్, సగాయరాజ్ ధ్రువీకరించారు.

ఈ విజయం గురించి వెర్సుని ఇండియా హోమ్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుల్బహర్ తౌరానీ మాట్లాడుతూ, ‘‘ప్రీతిలో, వినియోగదారుల పట్ల మా నిబద్ధత మాకే కాకుండా, మొత్తం వర్గానికి పరిపూర్ణతతో కూడిన కొలమానాన్ని నెలకొల్పేలా చేసింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా అత్యంత శక్తివంతమైన మిక్సర్ గ్రైండర్‌గా గుర్తింపు పొందినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము’’ అన్నారు. మేము జోడియాక్‌ను తయారు చేసినప్పుడు మిక్సింగ్, గ్రైండింగ్‌, బ్లెండింగ్‌ను సులభతరం చేయడం మరియు నమ్మదగిన, మన్నికైన ఉత్పత్తితో వినియోగదారుని అవసరాన్ని తీర్చడమే మా ఉద్దేశం. కొన్నేళ్లుగా, ప్రీతి ఒక మిలియన్ కన్నా ఎక్కువ మంది వినియోగదారులకు ప్రియమైన ఎంపికగా మారింది. దీనిని నిజమైన వంటగది పవర్‌హౌస్‌గా పిలుస్తారు. నేటి గుర్తింపు మా క్లెయిమ్‌లను ధ్రువీకరించడమే కాకుండా నాణ్యత మరియు పనితీరుల అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడానికి అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు.

ఆయన మరింత వివరిస్తూ, ‘‘విస్తరిస్తున్న వినియోగదారుల డిమాండ్‌లను తీర్చేందుకు, దృఢమైన సంబంధాలను నెలకొల్పేందుకు నిరంతరం ఆవిష్కరణలు చేస్తున్న బ్రాండ్‌గా, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన నూతన ఆవిష్కరణల కోసం నిరంతర ప్రయత్నాలు చేయాలని మేము భావిస్తున్నాము. అలా చేయడంపై మేము విశ్వాసాన్ని ఉంచాము. నేడు సాధించిన సాధన దీనికి ఉదాహరణగా ఉంది. రోజువారీ గృహోపకరణం పనితీరును, సామర్థ్యాన్ని అసాధారణ రీతిలో ఇది ప్రదర్శిస్తుంది. ప్రీతి జోడియాక్‌లో ఇటుక, కలప వంటి అసాధారణమైన వస్తువులు లేదా దాల్చినచెక్క మరియు పెద్ద మొత్తంలో పిండి వంటి రోజువారీ వస్తువులు అయినా ధృఢమైన పదార్థాలు అయినా సులభంగా మెత్తగా రుబ్బడానికి అవకాశం ఉంటుంది. ప్రీతి జోడియాక్ విజయం మనం సరైన మార్గంలో ఉన్నామని సూచిస్తుంది. మేము అత్యాధునిక సాంకేతికత మరియు అసమానమైన వినియోగదారు అనుభవంతో మార్కెట్‌ను నడిపిస్తూ, ఆవిష్కరణలను కొనసాగిస్తాము’’ అని పేర్కొన్నారు.

ప్రీతి కొత్త ఉత్పత్తుల శ్రేణిని ఆకర్షణీయమైన ఆఫర్‌లతో వేడుకలను మరింత ప్రత్యేకం చేస్తోంది. వినియోగదారుల వంట అనుభవాన్ని మెరుగుపరచడానికి, ప్రీతి కొత్త 1600W మరియు రెండు 2100W ఇండక్షన్ కుక్‌టాప్‌లను పరిచయం చేసింది. ఇందులో 4KV సర్జ్ ప్రొటెక్షన్, ప్రీ-సెట్ మెనూలు మరియు సాఫ్ట్ టచ్ ఆపరేషన్‌ల కోసం ట్రిపుల్ MOV ఫీచర్ ఉంది. ఈ కుక్‌టాప్‌లు రూ.2484తో ప్రారంభమయ్యే 1-ఏడాది ఉత్పత్తి వారంటీని, 3-ఏళ్ల కాయిల్ వారంటీతో అందుబాటులో ఉన్నాయి.అదనంగా, ప్రీతి రెండు కొత్త స్టెయిన్‌లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్‌లను విడుదల చేసింది: గ్లోరీ (2 బర్నర్) మరియు గ్లోరీ ప్లస్ (3 బర్నర్). రూ.2500 ధరతో ప్రారంభించి, గ్లోరీ స్టవ్‌లు వేగవంతమైన వంట కోసం +68% థర్మల్ ఎఫిషియెన్సీని అందిస్తాయి. స్థిరమైన నీలం రంగు మంట కోసం యాంట్‌గార్డ్ జెట్, పడిపోతాయనే భయం లేకుండా అన్ని స్టవ్వుల పరిమాణాలకు అనుగుణంగా దృఢమైన పాన్ సపోర్ట్ మరియు ఎర్గోనామిక్ నాబ్‌లను అందిస్తున్నాము. గ్లోరీ ప్లస్ సులభంగా శుభ్రపరచడానికి తొలగించగల డ్రిప్ ట్రేని కూడా కలిగి ఉంది. రెండు మోడల్‌లు 2 ఏళ్ల ఉత్పత్తి వారంటీ మరియు 5 ఏళ్ల బాడీ మరియు బర్నర్ వారంటీతో వస్తాయి.

పండుగ స్ఫూర్తిని పెంపొందిస్తూ, ప్రీతి పవర్ డ్యుయో, వాలెంటినో, మీరా, స్టైలో స్టీల్ మరియు గ్లామ్ స్టీల్‌తో సహా ప్రీమియం 2 మరియు 3 బర్నర్ గ్యాస్ స్టవ్‌లతో పాటు రూ.1550 విలువైన లావోపాలా 15-పీస్‌ల డిన్నర్ సెట్‌ను మరియు విలువైన 12-పీస్ డిన్నర్ సెట్‌ను, రూ.1250తో జంబో, జంబో మ్యాక్స్, బ్లేజ్, స్పార్కిల్, లక్స్ ప్రో మరియు గ్లీమ్‌తో సహా దాని మధ్య-శ్రేణి గ్యాస్ స్టవ్‌లతో అదనంగా అందిస్తుంది. జోడియాక్ కాస్మో, జోడియాక్ 2.0, జోడియాక్ గ్లిట్టర్, జోడియాక్ స్టార్‌డస్ట్ మరియు జోడియాక్ బ్లాక్‌తో సహా ఎంపిక చేసిన 750వా మరియు 1000వా జోడియాక్ మిక్సర్ గ్రైండర్‌లతో రూ.1525 విలువైన ఉచిత 3-పీస్ మిల్టన్ క్యాస్రోల్ సెట్ అందుబాటులో ఉంది.
వినియోగదారుల పట్ల తన నిబద్ధతను నిజం చేస్తూ, ప్రీతి తన మొత్తం ఉత్పత్తి శ్రేణిలో అంతరాయం లేని మరియు సంపూర్ణమైన బ్రాండ్ అనుభవాన్ని అందించేందుకు వినియోగదారులకు జీవితకాల ఉచిత సేవను అందిస్తూనే ఉంది.