Venuswamy apologizes to Telangana Women Commission

తెలంగాణ మహిళా కమిషన్‌కు వేణుస్వామి క్షమాపణలు

హైదరాబాద్‌: జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. కమిషన్‌ నోటీసులను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. దీంతో మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చి క్షమాపణ కోరారు.

కాగా, వేణుస్వామి ఇటీవల వివాహం చేసుకున్న నటుడు నాగచైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోష్యం చెప్పారు. త్వరలోనే ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి తేల్చి చెప్పారు. ఆయన చెప్పిన జ్యోషంపై అక్కినేని అభిమానులతో పాటు, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. గతంలో మహిళ జర్నలిస్టులు సైతం ఊమెన్ కమిషన్ కు వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు.

image

వేణుస్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన తెలంగాణ ఉమెన్‌ కమిషన్‌ వేణు స్వామి కి నోటీసులు జారీచేసింది. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. తాజాగా గతంలో ఇచ్చిన కోర్టు స్టేను ఎత్తివేయడంతో పాటు కోర్టు సైతం ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీస్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన కమిషన్ ముందు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేణుస్వామి మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఉమెన్ కమిషన్ కు బహిరంగ క్షమాపణలు కోరారు. కాగా ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని ఉమెన్ కమిషన్ హెచ్చరించింది.

Related Posts
ఉప ఎన్నికలకు సిద్ధమైన కడియం శ్రీహరి
ఉప ఎన్నికలకు సిద్ధమైన కడియం శ్రీహరి

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. గతేడాది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఆయన Read more

మార్చి 3న ఏపీ బడ్జెట్‌ !
AP Budget on March 3!

ఈనెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ అమరావతి : మార్చి 3న ఏపీ బడ్జెట్‌ ఉండనుందని సమాచారం అందుతోంది. మార్చి నెల 3 న Read more

ఫార్మసీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Green signal for replacemen

ఏపీలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత Read more

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పెరుగుతున్న కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు
MLC Jeevan Reddy has growing support from Congress seniors

హైదరాబాద్‌: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పార్టీ సీనియర్‌ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకుడు జీవన్‌రెడ్డికి అనుచరుడు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *