venky speech

పెళ్లాలకి మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు- వెంకటేశ్ విన్నపం

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.ఫామిలీ & యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా గ్రాండ్‌గా జనవరి 14 తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిల్ రాజు తన సొంత పట్టణం నిజమాబాద్‌లో భారీగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా రిలీజ్ కావడం తో మంచి బజ్ ఏర్పడింది.
,
ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో వెంకీ మామ ఫుల్ సందడి చేశారు. తనదైన శైలిలో డాన్సులు వేయడమే కాకుండా డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సినిమాలో ఐశ్వర్య తనను తెగ కొట్టిందని చెప్పారు. ‘పెళ్లాలకి అల్జీమర్స్ వచ్చినా భర్తల ఫ్లాష్ బ్యాక్స్ మాత్రం మర్చిపోరు. దయచేసి మీ పెళ్లాలకి మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు’ అంటూ డైలాగ్ చెప్పారు. సినిమా అదిరిపోతుందని, అందరూ థియేటర్లలో చూడాలని కోరారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సంక్రాంతి పండుగ సమయంలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమాను అందించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు మాదిరిగా రొమాంటిక్, కామెడీ, యాక్షన్ అంశాలను జొప్పించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారనే విషయం స్పష్టమైంది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ, వెంకటేశ్ మధ్య కెమిస్ట్రీ హిలేరియస్‌గా ఉందనే ఫీలింగ్ ట్రైలర్ కల్పించింది.

Related Posts
హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్: ముంబై, బెంగళూరు, చెన్నైతో అనుసంధానం
హైదరాబాద్‌లో బుల్లెట్ ట్రైన్: ముంబై, బెంగళూరు, చెన్నైతో అనుసంధానం

హైదరాబాద్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కీలకమైన ముందడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ల ద్వారా అనుసంధానించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో Read more

ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ
Rahul Gandhi met MPs

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న Read more

ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ
Liquor shops lottery today in AP

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా Read more

మహారాష్ట్రలో 58.22%, జార్ఖండ్ లో 67.59% ఓటింగ్: ఎన్నికల అప్‌డేట్
voting percentage

2024 ఎన్నికల రెండో దశలో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఈ రోజు మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఓటు వేయబడుతోంది, జార్ఖండ్ లో 81 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *