నేటి నుంచి సబ్సిడీతో కూరగాయలు – సీఎం చంద్రబాబు

వరద బాధిత కుటుంబాలకు నేటి నుంచి నిత్యావసరాల కిట్ తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రూ.2, రూ.5, రూ.10 ఈ మూడు రేట్లు మాత్రమే ఉంటాయి. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. ఆకు కూరలన్నీ రూ.2కే ఇస్తాం. రూ.10, రూ.15, రూ.20 ధర ఉన్న కూరగాయలను రూ.5కు, రూ.25, రూ.30 ధరలున్న వాటిని సబ్సిడీపై రూ.10కి అందుబాటులో ఉంచుతాం’ అని తెలిపారు.

బ్యాంకర్లు.. ఇన్స్యూరెన్స్ తో సమావేశం జరిగిందని.. ఇందులో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. చిన్న వ్యాపారాలు చేసుకొనేవారికి… వాహనాలకు జరిగిన నష్టం దృష్టిలో పెట్టుకొని 10 రోజుల కాల పరిమితి పెట్టుకొని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనే వారు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని చెప్పారు. గృహాలలో ఉన్న పరికరాలకు.. వస్తువులు నష్టపోయినవారిని ఆదుకునేందుకు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. బ్యాంక్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి వరద బాధితులకు ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.