Vallabhaneni Vamsi remanded until April 1

Gannavaram Court: ఏప్రిల్‌ 1 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్‌

Gannavaram Court: గన్నవరం కోర్టులో వైసీపీనేత వల్లభనేని వంశీని పీటీ వారెంట్‌పై అరెస్ట్‌ చేసి హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్‌ 1 వరకు వంశీకి రిమాండ్‌ విధించింది. అనంతరం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

Advertisements
image

ఆత్కూరు పోలీసులు కేసు నమోదు

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్‌ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని ఆమె కుమారులని ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ చేశారు. భూమిని కొనుగోలు చేసేందుకు తాను మహిళతో అగ్రిమెంట్‌ చేసుకున్నానని శ్రీధర్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా రాము, వల్లభనేని వంశీ, రంగా మరొకరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. గన్నవరం కోర్టులో ఆత్కూరు పోలీసులు ఇటీవల పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. కోర్టు అనుమతించటంతో మంగళవారం విజయవాడ నుంచి గన్నవరం తీసుకెళ్లి కోర్టులో హాజరు పర్చారు.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో విచారణ

తనకు జైలులో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు, ఫైబర్ కుర్చీ ఇచ్చేందుకు జైలు అధికారులను ఆదేశించాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగిన నేపథ్యంలో తాను వాటిపై ఆదేశాలివ్వలేనని గన్నవరం కోర్టు తెలిపింది. సంబంధిత కోర్టులోనే పరిష్కరించుకోవాలని వంశీకి సూచించింది. మెడికల్ రిపోర్టులు పొందుపరిస్తే వాటి ఆధారంగా ఫైబర్ కుర్చీ ఇచ్చే అంశంపై ఆదేశాలిస్తామని కోర్టు తెలిపింది. విచారణ అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Related Posts
Road Accident: కర్ణాటకలో రోడ్డుప్రమాదం..నలుగురు ఏపీ వాసుల మృతి
Road Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం – నలుగురు ఏపీ వాసుల మృతి

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా ష‌హ‌ర్‌పూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వాహనం వంతెనకు బలంగా Read more

Israel-Hamas : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. 59 మంది మృతి!
Israeli attacks on Gaza.. 59 people killed!

Israel-Hamas : ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా గాజా పై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 50 మందికి పైగా Read more

అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అంటే నారాయణ క్లారిటీ
అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అంటే నారాయణ క్లారిటీ

అమరావతి రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం చాలా రోజులుగా ఆశలు, అనుమానాలు ఉన్నా, ఇప్పుడు అక్కడి అభివృద్ధి గురించి Read more

Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్‌పై తిరుప‌తి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు
Karunakar Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్‌పై తిరుప‌తి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు

భూమనపై తిరుపతి పోలీసుల కేసు నమోదు – టీటీడీ గోశాలపై తప్పుడు వ్యాఖ్యల ఆరోపణ తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) మాజీ ఛైర్మన్‌ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×