గాజాపై దాడి సమాచారం తమకు ముందస్తు తెలిపింది: అమెరికా

Israel: గాజాపై దాడి సమాచారం తమకు ముందస్తు తెలిపింది: అమెరికా

హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఓవైపు రెండో దశ చర్చలకు సిద్ధమవుతూనే గాజాపై బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో గాజాలో సుమారు 200 మంది వరకు చనిపోయారని సమాచారం. దీనిపై హమాస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించిందని మండిపడింది.

Advertisements
గాజాపై దాడి సమాచారం తమకు ముందస్తు తెలిపింది: అమెరికా

ఇజ్రాయెల్ దాడులపై అగ్రరాజ్యం స్పందన
ఈ దాడితో తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. గాజాపై దాడికి సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం తమకు ముందస్తు సమాచారం ఇచ్చిందని తెలిపింది. తమను సంప్రదించాకే దాడి చేసిందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ తో పాటు అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్ మిలిటెంట్లకు, హుతీలకు ఇదొక హెచ్చరిక అని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ చెప్పారు.
హమాస్ ను హెచ్చరించిన ట్రంప్
బందీలను విడిచిపెట్టాలని, గాజాను వదిలిపెట్టి వెళ్లాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హమాస్ ను హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన హమాస్.. ప్రస్తుతం దాని ఫలితం అనుభవిస్తోందని పేర్కొన్నారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు, బందీల అప్పగింతకు హమాస్ అంగీకరించకపోవడం వల్లే గాజాపై దాడులు జరపాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివరణ ఇచ్చారు.

Related Posts
మూసీపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? భ‌ట్టి కి జ‌గ‌దీశ్ రెడ్డి స‌వాల్
jagadeesh saval

మూసీ సుంద‌రీక‌ర‌ణ‌కు సంబంధించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉన్న ప్ర‌ణాళిక ఏంటో చెప్పాల‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీని ఏం Read more

అమెరికా పౌరసత్వంపై ట్రంప్ కామెంట్స్
వలసదారులను వెనక్కి పంపడం అమెరికాకే నష్టం: ఆర్ధిక వేత్తలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టుక ఆధారిత పౌరసత్వ (బర్త్ రైట్ సిటిజన్‌షిప్) పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయంలో, ఈ చట్టం నిజానికి Read more

రన్యా రావు పై అధికారుల ప్రశ్నల వేధింపు – నటి ఆరోపణలు
రన్యా రావు పై అధికారుల ప్రశ్నల వేధింపు నటి ఆరోపణలు

రన్యా రావు పై అధికారుల ప్రశ్నల వేధింపు – నటి ఆరోపణలు కన్నడ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న నటి రన్యా రావు తాజాగా చర్చనీయాంశంగా మారారు. Read more

Telangana: తెలంగాణలో మొదలైన ధాన్యం కేంద్రాలు
తెలంగాణలో ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు

తెలంగాణలోని రైతుల కోసం రబీ సీజన్‌లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. వరి కోతలు ప్రారంభం అవ్వడంతో, మార్కెట్‌లో ధరలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×