gautam adani

అదానీపై అమెరికా ఆరోపణలు వ్యూహాత్మక తప్పిదం: ఫోర్బ్స్ నివేదిక

భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా న్యాయ శాఖ చేసిన నేరారోపణ తీవ్రమైనవని, భౌగోళిక రాజకీయ పరిణామాలతో కూడిన వ్యూహాత్మక తప్పిదమని ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ నివేదిక స్పష్టం చేసింది. చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌తో అమెరికా బలమైన భాగస్వామ్యం కోరుకుంటున్న సమయంలో ఈ ఆరోపణలు చేయడం ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ‘భారత్‌పై తీవ్ర నేరారోపణతో పశ్చిమ దేశాల సంబంధాలకు అమెరికా విఘాతం కలిగిస్తోంది’ అనే శీర్షికన ఆథర్ మెలిక్ కేలన్ రాసిన ఆర్టికల్‌‌ను ఫోర్బ్స్ ప్రచురించింది. అమెరికాలో నిధుల సమీకరణ కోసం 25 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 2,100 కోట్లు) లంచంగా ఇవ్వజూపారని, పశ్చిమ దేశాలకు భారత్ కీలకమైన భాగస్వామి అని, ముఖ్యంగా చైనా ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ ఇనిషియేటివ్ కు పోటీగా రూపొందించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ను ఆర్టికల్ హైలైట్ చేసింది. ‘‘అయితే అమెరికా న్యాయశాఖ చర్య కీలకమైన సమయంలో ఆర్థిక సహకారం, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.. ఇది భారత్‌ను రష్యా, చైనాలకు దగ్గర చేసే అవకాశం ఉంది.

దీని వల్ల అమెరికా తన సొంత భౌగోళిక రాజకీయ స్థానాన్ని బలహీనపరుస్తుంది.. ప్రత్యర్థులు మరింత బలోపేతం కావడానికి వీలు కల్పిస్తుంది’’ అని ఫోర్బ్స్ తెలిపింది.అదానీ, ఆయన బంధువులపై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. అదానీపై అమెరికా న్యాయశాఖ చర్య కేవలం చట్టపరమైన నిర్ణయం కాదని.. ప్రపంచ స్థిరత్వానికి పశ్చిమ దేశాలతో భారత్ పొత్తు చాలా కీలకమైన సమయంలో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉన్న దౌత్యపరమైన వ్యూహాత్మక తప్పిదమని ఫోర్బ్స్ మండిపడింది.

Related Posts
యజమానిని కాపాడేందుకు బలయిన కుక్క
యజమానిని కాపాడేందుకు బలయిన కుక్క

యజమాని కోసం ప్రాణత్యాగం చేసిన జర్మన్ షెఫర్డ్.శునకాలు విశ్వాసానికి మారుపేరు. ఇవి యజమాని పట్ల విశ్వాసంతో ఉంటూ నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటి Read more

భారత్‌కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
భారత్‌కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

భారత్‌కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు భారత్‌కు ఇద్దరు పొరుగు దేశాల నుంచి ఒకేసారి యుద్ధ ముప్పు పెరుగుతోందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర Read more

మిస్టర్‌బీస్ట్‌ యొక్క అద్భుతమైన సాహసం: బూర్జ్ ఖలీఫా పైకి ఎక్కడం
MrBeast Burj Khalifa

యూట్యూబర్ జిమీ డన్లాప్స్, ప్రపంచవ్యాప్తంగా మిస్టర్‌బీస్ట్‌ అని గుర్తింపు పొందిన వ్యక్తి, ఇటీవల ఒక అద్భుతమైన సాహసం చేశాడు. ఆయన దుబాయిలోని బూర్జ్ ఖలీఫా అనే ప్రపంచంలోని Read more

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్‌: నిర్మలా సీతారామన్‌
nirmala sitharaman

ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టినప్పటికీ.. నిరసనల మధ్యే బడ్జెట్‌ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *