తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు కేంద్రమంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తోమాల సేవలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈక్రమంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన గడ్కరీ పలువురు అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే.

అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సత్సంగ్‌ పౌండేషన్‌ ఆవరణలో బుధవారం ఆదినాథ్‌ శ్రీగురు మహావతార్‌ బాబా విగ్రహాన్ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ఫౌండర్‌ పద్మశ్రీ అవార్డు గ్రహీత ముంతాజ్‌అలీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌ బాష, ఎస్‌పి విద్యా సాగర్‌ నాయుడు, బిజెపి నేతలు పాల్గన్నారు. చిప్పిలికి చేరుకున్న మంత్రి గడ్కరికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. మంత్రి మండిపల్లి, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కేంద్ర మంత్రిని కలిసి అన్నమయ్య జిల్లా రహదారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి, జిల్లా అభివృద్ధి బాటలు వేయాలని కోరారు.