పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు దఫాలుగా కేంద్రంతో పోలవరంపై చర్చించారు. ప్రధానమంత్రి, ఆర్థిక, జలశక్తి మంత్రులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో, కేంద్రం నుంచి సానుకూల స్పందన వెలువడింది. జాతీయ ప్రాజెక్టు పోలవరంను పూర్తిగా నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.

పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి రూ.12,500 కోట్ల నిధులు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర మంత్రులతో జరిగిన మీటింగ్‌లలో కోరారు. కాగా ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. మొదటి దశ నిర్మాణానికి మొత్తం రూ. రూ.12,500 కోట్ల నిధులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పోలవరం పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.